BIKKI NEWS (ఆగస్టు – 24) : 2021 సంవత్సరానికి గాను NATIONAL FILM AWARDS 2023ను ఈరోజు ప్రకటించారు ఇందులో తెలుగు చిత్రాల హవా స్పష్టంగా కనిపించింది. RRR చిత్రానికి 6, పుష్ప చిత్రానికి రెండు అవార్డులతో పాటు… మొట్టమొదటిసారి తెలుగు సినీ నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ ఈ అవార్డుని సొంతం చేసుకున్నాడు.
★ తెలుగు సినిమాకు దక్కిన అవార్డులు
జాతీయ ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప – ది రైజ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – పాటలు – దేవిశ్రీప్రసాద్ (పుష్ప – ది రైజ్)
ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రం – RRR
ఉత్తమ సంగీత దర్శకుడు – నేపథ్యం – యమ్.యమ్. కీరవాణి ( RRR)
ఉత్తమ నేపథ్య గాయకుడు – కాల బైరవ (RRR – కొమురం భీముడో)
ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రాఫి – ప్రేమ్ రక్షిత్ (RRR)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫి – కింగ్ సాలమన్ (RRR)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – శ్రీనివాస్ మెహన్ (RRR)
ఉత్తమ తెలుగు చిత్రం – ఉప్పెన
ఉత్తమ గీత రచన – చంద్రబోస్ (కొండపొలం)
ఉత్తమ చిత్ర విమర్శకుడు – పురుషోత్తమచార్యులు