MS SWAMINATHAN : MS స్వామినాథన్ కన్నుమూత

చెన్నై (సెప్టెంబర్ – 28) : హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఏస్. స్వామినాథన్ కన్నుమూశారు (MS SWAMINATHAN PASSED AWAY). 98 ఏళ్ల వయసున్న ఆయన ఈరోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ఈయన ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో మేలైన గోధుమ, వరి వంగడాలను సృష్టించి, ప్రపంచ ఆకలి తీర్చారు.

స్వామినాథన్ 1925 AUG 7న జన్మించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామన్ మెగసెసె లాంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ (జ.1925 ఆగస్టు 7) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో “హరిత విప్లవ పితామహుడు” గా పేర్కొంటారు. అతను “ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్” ను స్థాపించి దాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.అతను ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టాడు. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశాడు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించాడు.

స్వామినాథన్ ప్రాథమిక, అనువర్తిత మొక్కల పెంపకం, వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ వంటి సమస్యలలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సహచరులు, విద్యార్థులతో కలసి పనిచేసాడు.

అతని వృత్తిపరమైన జీవితం 1949 నుండి ప్రారంభమైనది

 • 1949–55 – బంగాళాదుంప (సోలానం ట్యుబరోసం), గోధుమ (ట్రిటికం ఏస్తివం), వరి (ఒరైజా సటైవా), జనపనార జన్యువులపై పరిశోధన.
 • 1955–72 – మెక్సికన్ మరగుజ్జు గోధుమ వంగడాలపై పరిశోధన. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో సైటొజెనెటిక్స్, రేడియేషన్ జెనెటిక్స్, మ్యుటేషన్ బ్రీడింగ్, గోధుమ,వరి జెర్మోప్లాసం నమూనాల అభివృద్ది.
 • 1972–79 – డైరక్టర్-జనరల్ : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చి; భారతదేశంలో మొక్కలు, జంతువులు, చేపల జన్యువనరుల కొరకు జాతీయ బ్యూరో ఏర్పటు. అంతర్జాతీయ మొక్కల జన్యువనరుల సంస్థ ఏర్పాటు (2006లో బయోడైవర్శిటీ ఇంటర్నేషనల్ గా మారినది).
 • 1979–80 – భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శి; ముందస్తు పెట్టుబడుల ఫారెస్టు సర్వే ప్రోగ్రాం ను ఫారస్టు సర్వీస్ ఆఫ్ ఇండియాగా మార్పు.
 • 1981–85 – స్వతంత్ర చైర్మన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) కౌన్సిల్,రోం, మొక్కల జన్యువనరుల కమిషన్ స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర.
 • 1983 – రైతుల హక్కుల భావన, ప్లాంట్ జెనెటిక్స్ రీసోర్సెస్ కు గ్రంథం రూపకల్పనను అభివృద్ధి చేశాడు.
 • 1982–88 – డైరక్టరు జనరల్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IRRI), అంతర్జాతీయ రైస్ జెర్మ్‌ప్లాసం వ్యవస్థాపన, ప్రస్తుతం అంతర్జాతీయ రైస్ జెనీబ్యాంకు.
 • 1984–90 – అధ్యక్షుడు, అంతర్జాతీయ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ ( IUCN), జీవవైవిధ్యం మీద సమావేశం అభివృద్ధి.
 • 1986–99 – వాషింగ్టన్ డి.సి లోని వరల్డ్ రీసోర్స్ ఇనిస్టిట్యూట్ సంపాదక మండలి చైర్మన్., మొట్టమొదటి “వరల్డ్ రిసోర్స్ రిపోర్ట్.” రూపకల్పన.
 • 1988–91 –ఇంటర్నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, కీస్టోన్ ఇంటర్నేషనల్ డైలాగ్ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్., మొక్కల జెర్మ్‌ప్లాజం లభ్యత, ఉపయోగం, మార్పిడి, రక్షణ గురించి కృషి.
 • 1991–1995 – సభ్యుడు, గవర్నింగ్ బోర్డు, ఆరోవిల్లీ ఫౌండేషన్.
 • 1988–96 – అధ్యక్షుడు, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ – ఇండియా WWF, ఇందిరాగాంధీ పర్యవేక్షణ, పరిరక్షణ కేంద్రం నడుపుట. కమ్యూనిటీ బయోడైవర్శిటీ కన్జర్వేషన్ ప్రోగ్రాం నిర్వహణ.
 • 1988–99 – చైర్మన్/ట్రస్టీ, కామన్‌వెల్త్ సెక్రటేరియట్ ఎక్స్‌పర్ట్ గ్రూపు. గయానాలోని ఉష్ణమండల వర్షారణ్యాల నిర్వహణ, రైన్ ఫారెస్టు పరిరక్షణ, అభివృద్ధి కోసం ఇవోక్రమ ఇంటర్నేషనల్ సెంటర్ నిర్వహణ. గయానా అధ్యక్షుడు 1994లో “స్వామినాథన్ లేకుండా ఇవోక్రమ లేదు” అని రాసాడు.
 • 1990–93 – వ్యవస్థాపకుడు/అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్.
 • 1988–98 – జీవవైవిధ్యానికి సంబంధించిన ముసాయిదా చట్టం, పెంపకందారులు, రైతుల హక్కులు చట్టం రూపకల్పనలో భారత ప్రభుత్వం నియమించిన అనేక కమిటీలలో స్థానం పొందాడు.
 • 1993లో స్వామినాథన్ నేషనల్ పాపులేషన్ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనలో భారత పార్లమెంటుచే నియమింపబడిన నిపుణుల బృదానికి నాయకత్వం వహించాడు. 1994లో నివేదిక అందజేసాడు.
 • 1994 – వరల్డ్ హుమానిటీ ఏక్షన్ ట్రస్టు జెనెటిక్ డైవర్సిటీ పై వేసిన కమిషన్ కు చైర్మన్. సాంకేతిక వనరుల కేంద్రాన్ని స్థాపించాడు.
 • 1994 తర్వాత – చైర్మన్, జెనెటిక్ రీసోర్స్ పాలసీ కమిటి, కన్సల్టేటివ్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్.
 • 1995–1999 చైర్మన్, ఆరోవిల్లీ ఫౌండేషన్
 • 1999 – జీవావరణ నిల్వల గూర్చి ట్రస్టీ ఏర్పాటు భావనను పరిచయం చేసాడు.
 • 2001 – చైర్మన్, రీజనల్ స్టీరింగ్ కమిటీ , జీవావరణ నిర్వహణపై ఇండియా – బంగ్లాదేశ్ ఉమ్మడి ప్రాజెక్టు.
 • 2004 – 2014 – చైర్మన్, నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్.
 • అతని సారధ్యంలో 68 మంది విద్యార్థులు పి.హెచ్.డి చేస్తున్నారు.