భారతదేశ అత్యున్నత సైన్స్ పురస్కారం శాంతి స్వరూప్ భట్నగర్ బహుమతి 2020 (shanti swarup bhatnagar awards 2020) ఏడాదికి గాను 14 మంది శాస్ర్తవేత్తలకు లభించింది. అవార్డు పొందిన 14 మంది శాస్త్రవేత్తల పేర్లను కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) విడుదల చేసింది. ప్రతీ ఏడాది శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో పాటు రూ. 5 ప్రైజ్ మనీగా అందజేస్తారు.
shanti swarup bhatnagar awards 2020
* ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి డాక్టర్ అభిజిత్ ముఖర్జీ,
* ఐఐటీ కాన్పూర్ నుంచి డాక్టర్ బుష్రా అతీక్
* సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ నుండి డాక్టర్ శుభదీప్ ఛటర్జీ,
* నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ నుండి డాక్టర్ వత్సల తిరుమలై,
* ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ నుండి డాక్టర్ జ్యోతిర్మాయే దాస్,
* ఐఐటి బొంబాయి నుండి డాక్టర్ సూర్యేందు దత్తా,
* జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ నుండి డాక్టర్ సుబి జాకబ్ జార్జ్ ,
* బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ కిన్‌షుక్ దాస్‌గుప్తా,
* పిజిఐఎంఈఆర్ చండీగఢ్ నుండి డాక్టర్ రితేష్ అగర్వాల్
* హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ అమోల్ అరవింద్రావ్ కులకర్ణి, డాక్టర్ సూరజిత్ ధారా అవార్డులను అందుకున్నారు.