JEE MAIN 2024 : ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్

హైదరాబాద్ (సెప్టెంబర్ 05) జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కసరత్తు చేస్తున్నది. JEE MAIN – 1ను 2024 ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ సారి రెండు విడుతల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు.

డిసెంబర్ రెండో వారం నుంచి 2024 జనవరి రెండో వారం వరకు జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఇక మొదటి సెషన్ 2024 ఫిబ్రవరి మొదటి వారంలో జరగనుండగా, రెండో సెషన్ 2024 ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నారు.

★ CUET UG 2024

అదేవిధంగా, సీయూఈటీ (యూజీ) రిజిస్ట్రేషన్లు 2024 ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభంకానున్నాయి. పరీక్షలను మే చివరి వారంలో నిర్వహించాలని ఎన్డీఏ భావిస్తున్నది.

★ NEET UG 2024

నీట్ – యూజీ రిజిస్ట్రేషన్లు 2024 మార్చి మొదటి వారంలో ప్రారంభించనుండగా, పరీక్షను మే రెండో వారంలో నిర్వహించనున్నారు.