న్యూడిల్లీ (నవంబర్ – 15) : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ స్పోర్ట్స్ కోట 2023 కింద ఖాళీగా ఉన్న 248 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (ITBP POLICE CONSTABLE JOBS NOTIFICATION) పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది.
పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 28వ తేదీ లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు : కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) – 248 పోస్టులు
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, ఈక్వెస్ట్రియన్, స్పోర్ట్స్ .షూటింగ్, బాక్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, కబడ్డీ, రెజ్లింగ్, ఆర్చరీ, కయాకింగ్, కానోయింగ్, రోయింగ్.
అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.
వయోపరిమితి : 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్ : 21,700/- నుంచి 69,100/-
పరీక్ష ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.100. (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు)
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తుకు గడువు – నవంబర్ – 13 నుండి 28 వరకు