IPL 2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్

  • 4వ సారి విజేతగా ధోనీ టీమ్
  • రన్నరప్ గా కలకత్తా
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – డుప్లెసిస్ (86)
  • ప్లేయర్ ఆప్ ద సీరిస్ – హర్షల్ పటేల్
  • ఎమర్జింగ్ ప్లేయర్ – రుతురాజ్ గైక్వాడ్
  • రన్నరప్ ప్రైజ్ మనీ – 12.5 కోట్లు
  • విజేత ప్రైజ్ మనీ – 20 కోట్లు

BIKKI NEWS : దుబాయ్ వేదికగా జరిగిన 14వ ఐపీఎల్ – 2021 ఎడిషన్ విజేతగా (IPL 2021 WON BY CSK) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కలకత్తా నైట్ రైడర్స్ ని 27 పరుగుల తేడా తో ఓడించి నిలిచింది.. ధోనీ కెప్టెన్సిలో చెన్నై జట్టుకి ఇది 4వ టైటిల్.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకన్న కలకత్తా జట్టు బౌలింగ్ లో విఫలం చెందింది. డుప్లెసిస్ నిలకడగా బ్యాటింగ్ తో పాటు గైక్వాడ్, ఊతప్ప, మొయిన్ ఆలీ ల దూకుడు బ్యాటింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలో 192/3 పరుగులు సాదించి భారీ స్కోరు ను కలకత్తా ముందు ఉంచింది.

కలకత్తా బ్యాటింగ్ లో ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్, శుభమన్ గిల్ రాణించి అర్ద సెంచరీలు సాదించి లక్ష్యం దిశగా టీమ్ ను తీసుకెళ్లిన వారి వికెట్లు కోల్పోయిన తర్వాత కలకత్తా వరుస వికెట్లు కోల్పోయి ఓటమి (165/9) చెందింది.

  • ఈ సీరీస్ లో రుతురాజ్ గైక్వాడ్ (సీ.ఎస్.కె.) అత్యధిక పరుగులు(635) సాదించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
  • ఈ సీరీస్ లో అత్యధిక వికెట్లు (32) తీసిన హర్షల్ పటేల్ (ఆర్.సీ.బీ.)తీసి పర్పుల్ క్యాప్ సాదించాడు.
  • ఈ సీరీస్ లో అత్యధిక సెంచరీలు గైక్వాడ్ (2), సంజూ శాంసన్ (2), పడిక్కల్ (1), బట్లర్ (1) సాదించారు.
  • ఈ సీరీస్ లో హ్యాట్రిక్ సాదించిన ఒకే ఒక బౌలర్ హర్షల్ పటేల్
  • ఈ సీరీస్ లో వేగవంతమైన సెంచరీ పడిక్కల్ 51 బంతులలో సాదించాడు.
  • ఈ సీరీస్ లో అత్యదిక వ్యక్తిగత స్కోర్ బట్లర్ (124) సాదించాడు.