BIKKI NEWS (FEB. 21) : తల్లి ముఖతా ఉగ్గుపాలతో అప్రయత్నంగా నేర్చుకునేది మాతృభాష. (International Mother Language Day) మనిషి అప్రయత్నంగా, ఏ కష్టం లేకుండా జీవితంలో నేర్చుకునే మొదటి భాష మాతృ భాష. “పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం” లాంటిదన్న విశ్వకవి రవీంద్రుని మాటలు అక్షర సత్యాలు. మాతృభాష జ్ఞానార్జనకు, భావ వ్యక్తీకరణకు, విషయ గ్రహణకు, రసానుభూతికి, తోడ్పడుతుంది కాబట్టే “తల్లి నొడికంటె పరమామృతంబు గలదే “అని రాయప్రోలు గారన్నారు.
International Mother Language Day
భారత రాజ్యాంగములోని 345వ అధికరణం తమ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారమివ్వగా ఆంధ్రప్రదేశ్ విభాగం 1966లో అధికార భాషా శాసనాన్ని తయారుచేసింది. దీని ప్రకారం తెలుగు అధికార భాషా స్థానాన్ని పొందింది. పరిపాలనా వ్యవహారాలన్ని తెలుగు భాషలో జరగాలని 1974 లో “అధికారభాషా సంఘం” ఏర్పడింది. రాష్ట్ర రాజకీయ పరిపాలన, న్యాయసంస్థలలో వ్యవహరించే భాషను పూర్వం “రాజభాష” అనగా ఇప్పుడు అధికార భాష అంటున్నారు.
తూర్పు పాకిస్తానీయులైన బంగ్లాదేశీయులు చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతీ యేట అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలున్న భాషలు సుమారు 6,000 కాగా మనదేశంలో 1,652 మాతృభాషలున్నాయి.
3000 BC లో వ్రాయబడ్డ సుమేరియన్ భాష అతి పురాతన లిఖిత భాష కాగా 74 అక్షరాల అతిపెద్ద వర్ణమాల కలిగిన భాష కంబోడియా లోని ఖైమర్ భాష.
గత 300 సంవత్సరాల్లో ఒక్క అమెరికా ఆస్ట్రేలియాలలోనే అనేక మాతృభాషలు అంతమైపోయాయి . ఈ ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగానే యునెస్కో “మాతృభాషల పరిరక్షణ ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘీక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులలో అంతర్భాగం అని నిర్ధారించింది . అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేది నాడు జరుపుకోవాలని యునెస్కో 1999 నవంబరు 17 నాడు 30 వ సాధారణ మహాసభలోప్రకటించింది. ప్రపంచంలోని భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడానికీ, బహుభాషా విధానాన్ని ప్రోత్సహించడానికీ, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఇది సరైన మార్గం అని యునెస్కో తెలిపింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్ ను కూడా యునెస్కో ప్రకటిస్తోంది.
భారత రాజ్యాంగం గుర్తించిన నాలుగు ముఖ్యమైన ద్రావిడ భాషలలో తెలుగు కూడా ఒకటి. ద్రావిడ భాషలను మాట్లాడే వారిలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అధికం. భారత దేశంలో హిందీ ప్రథమ స్థానం వహించగా తెలుగు ద్వితీయ స్థానంలో ఉంది. 2000సంవత్సరాల క్రితమే తెలుగు ఒక స్వతంత్ర భాషగా స్థిరపడిపోయింది. భారతీయ భాషలలో తెలుగుకు ఒక ప్రత్యేకతగలదు. “The Italian of the East” is based on the novel “The Italian of the East” by the author of “The Italian of the East.”
భారతదేశంలో అనేక రాష్ట్రాలు భాషాప్రయుక్త రాష్ట్రాలే. అన్ని రాష్ట్రాలలో అక్కడి ప్రాంతీయభాషను ప్రథమ భాషగా బోధిస్తారు. అంటే అక్కడి ప్రజల మాతృభాషే ప్రథమ భాష. పాఠశాల విద్యలో విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని 1956లో కేంద్ర విద్యా విషయక సలహా సంఘం(CABE) త్రిభాషా సూత్రాన్ని రూపొందించింది. దాని ప్రకారం అన్ని రాష్ట్రాలలోని పాఠశాలలలో మూడు భాషలు బోధించాల్సి ఉంటుంది. 1) మాతృభాష లేదా ప్రాంతీయభాష 2) జాతీయభాష హిందీ 3) అంతర్జాతీయభాష ఆంగ్లం.
ప్రజాస్వామ్యంలో ప్రజల భాషలో పరిపాలన జరగడం ఉచితం. పాలనా వ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలు ప్రజలకు తెలియాలంటే ప్రజల భాష అవసరం .
అధికార భాషగా తెలుగు అమలుకు తెలుగు అకాడమి 1969లో తెలుగు రాని ఉద్యోగులకు ఉచిత తరగతులు నిర్వహించడం ,1963లో పారిభాషిక పదకోశం తయారీ, 1980లో 27,600 పదాలతో పరిపాలనా న్యాయపదకోశం తయారీ వంటి విశిష్టమైన పాత్ర పోషించి మాతృ భాషాభివృద్ధికి తోడ్పడింది.
మాతృభాషాధ్యయనం సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికీ, సృజనాత్మకతకు, దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించడానికీ, సంస్కృతీ సంప్రదాయాలను గ్రహించడానికి తోడ్పడుతుంది. మాతృభాషలో బోధన జీవనోపాధినిస్తుంది అన్న విషయాలను మరచి పాశ్చాత్య పరభాషల మోజులో పడి ప్రాథమిక దశ నుండి ఆంగ్లమాధ్యమంలోనే బోధనకు మొగ్గుచూపుతూ ఉగ్గుపాల భాషకు అన్యాయం చేస్తున్నారు. సాహిత్య వారసత్వ సంపదకు జాతి మనుగడకు మాతృభాష ఎంతో దోహదం చేస్తుంది. సుసంపన్నమైన మన భాషా సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం వారసత్వ సంపదగా తరాలవారికందించడం భాషను కాపాడడం మన అందరి బాధ్యత. భావి తరాల బతుకుపథ నిర్దేశమైన మాతృభాష భావి తరాలకు శ్వాస అని తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలలో బహుభాషా వాదాన్ని ప్రోత్సహించడానికే మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము
వ్యాసకర్త :
అడ్డగూడి ఉమాదేవి తెలుగు అధ్యాపకురాలు 9908057980
- GK BITS IN TELUGU MARCH 19th
- చరిత్రలో ఈరోజు మార్చి 19
- TG POLYCET 2025 – పాలిసెట్ నోటిఫికేషన్
- CURRENT AFFAIRS IN TELUGU 16th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- INTER EXAMS – 10వ రోజు రిపోర్ట్ – 15 మంది డిబార్