FRIENDSHIP DAY : స్నేహితుల దినోత్సవం

BIKKI NEWS : INTERNATIONAL FRIENDSHIP DAY ను ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటివి బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు.

1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి. నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహవంతంగా జరుపుకుంటున్నాయి.

అనేకమంది స్నేహితులు పరస్పరం ఒకరికొకరు ఈ రోజున బహుమతులను, కార్డులను ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. “ప్రెండ్షిప్ బ్యాండ్లు” భారతదేశం, నేపాల్, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి.

తల్లిదండ్రులు, సోదరులు కుటుంబ పరంగా అనుబంధం పంచితే స్నేహితుడు సామాజిక అనుబందానికి ప్రతీక.