GATE 2024 : నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (ఆగస్టు – 06) : GATE 2024 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ను IISc బెంగళూరు విడుదల చేసింది. పలు ఐఐటీలు కేంద్ర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. గేటు స్కోర్ ఆధారంగా పలు కేంద్ర విద్యాసంస్థల్లో అడ్మిషన్ లే కాకుండా… పలు సంస్థలు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తాయి.

అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

GATE 2024 ADMIT CARDS ను జనవరి – 03 – 2024 న విడుదల చేయనున్నారు.

GATE 2024 EXAMను 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 వ తేదీలలో నిర్వహించనున్నారు.

GATE 2024 RESULTS ను మార్చి 16 – 2024 న విడుదల చేయనున్నారు.

ఈ విద్య సంవత్సరంలో డేటా సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన సబ్జెక్టును కూడా ప్రవేశపెట్టారు.

వెబ్సైట్ : https://gate2024.iisc.ac.in/