Home > 6 GUARANTEE SCHEMES > 6 GUARANTEES – ఆరు గ్యారంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు

6 GUARANTEES – ఆరు గ్యారంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు

BIKKI NEWS (JAN. 04) : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలను (indiramma committees for 6 Guarentees) ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామానికి, వార్డుకు ఐదుగురితో ఏర్పాటు చేసే కమిటీల ద్వారా ఆరు గ్యారంటీలను ప్రజలందరికీ అందించేలా పనిచేయాలని టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థను పొలి ఉండనున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల అమలులో పార్టీ పాత్ర తదితర అంశాలపై చర్చించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయించే బాధ్యతను పార్టీ తీసుకోవాలని, ప్రజలకు చేరవేసే పనిని పార్టీ కార్యకర్తలకు అప్పగించాలని నిర్ణయించారు

★ ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతాం – రేవంత్‌

రాష్ట్ర ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామన్నారు. తాము అధికారంలోకి వచ్చి నెలరోజులు గడవక ముందే కాంగ్రెస్‌ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని విమర్శించారు*

★ పథకాలు ప్రజలకు చేరవేయండి – భట్టి విక్రమార్క

దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలకు గొప్ప అవకాశం లభించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్టీ పై విశ్వాసంతో ప్రజలు గెలిపించారని, వారి నమ్మకాలను వమ్ము చేయకుండా ప్రభుత్వ పథకాలను వారికి చేరవేసే బాధ్యతను పార్టీ శ్రేణులు తీసుకోవాలని కోరారు.