Home > NATIONAL > TIGER RESERVE – దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుకు అమోదం

TIGER RESERVE – దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుకు అమోదం

BIKKI NEWS (నవంబర్ – 26) : భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుకు (India’s biggest tiger reserve in madya pradesh) అమోదం తెలిపింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2,300 చదరపు కి.మీ విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వు ఏర్పాటు కానుంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభ్యయారణ్యాలను కలిపేయనున్నారు.

దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆదివారం కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ రెండు అభయారణ్యాలు సాగర్, దమోహ్, నర్సింగప్పర్, రైసెన్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.