BIKKI NEWS (NOV. 20) : HYDROGEN TRAIN IN INDIA. HYDROGEN TRAIN HIGHLIGHTS. భారత దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ ను 2024 డిసెంబర్ చివరిలో పట్టాలెక్కించనుంది రైల్వే శాఖ.
HYDROGEN TRAIN IN INDIA
పర్యావరణానికి ఎలాంటి హని కలిగించని హైడ్రోజన్ ను ఇంధనంగా ఈ ట్రైన్ కు వాడడమే దీని ప్రత్యేకత. డీజిల్, ఎలక్ట్రికల్ ఇంధనాలతో పోలిస్తే చౌకగా మరియు పర్యావరణ హితంగా హైడ్రోజన్ ఇంధనం ఉంటుంది.
ప్రపంచంలో మొదటి హైడ్రోజన్ ట్రైన్ నం జర్మనీ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎక్కువ హైడ్రోజన్ ట్రైన్ లు ఉన్న దేశం జర్మని.
జర్మనీ తర్వాత చైనా, రష్యా, ఇటలీ లు హైడ్రోజన్ ట్రైన్ ను నడుపుతున్నాయి. భారతదేశం ఈ హైడ్రోజన్ ట్రైన్ కలిగిన 5వ దేశం కానుంది.
జర్మనీ సహకారంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ హైడ్రోజన్ ట్రైన్ ను నిర్మించింది.
మొదటి హైడ్రోజన్ ట్రైన్ ను హర్యానా లోని జింద్ – సోనిపట్ మద్య 90 కిలోమీటర్ల మద్య ప్రారంభించనున్నారు.
HYDROGEN TRAIN HIGHLIGHTS
నీటి నుంచి హైడ్రోజనన్ను ఉత్పత్తి చేస్తారు. ఆ హైడ్రోజన్న, ఆక్సిజన్ కలిపినప్పుడు రసాయన చర్య జరిగి వెలువడే శక్తి ద్వారా రైలును నడిపిస్తారు. ఇందుకోసం రైలు ఇంజిన్లలో హైడ్రోజన్, ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేస్తారు.
ఒకసారి ఇంధనాన్ని నింపితే 1000 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుందని అంచనా.
హైడ్రోజన్ ఇంజిన్లు డీజిల్ ఇంజిన్ల కంటే 65 శాతం తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుత పరిజ్ఞానం మేరకు గరిష్టంగా 140 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
54.6 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఒక కిలో హైడ్రోజన్ ఇంధనం 4.5 లీటర్ల డీజిల్ తో సమానంగా శక్తిని అందిస్తుంది. ఓ అంచనా మేరకు ఒక్కో హైడ్రోజన్ రైలు ద్వారా ఏడాదికి రూ.16 లక్షల డీజిల్ ఆదా అవుతుంది.
ఒక డీజిల్ ఇంజిన్ ద్వారా ఏడాదిలో 4,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. హైడ్రోజన్ ఇంజన్ తో ఆ కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుంది. హైడ్రోజన్ ఇంజిన్ లో ఇంధనాన్ని మండించిన తర్వాత వ్యర్థాలుగా నీరు, నీటి ఆవిరి వెలువడతాయి.
రైల్వే 50 హైడ్రోజన్ రైళ్లను రూపొందించనుంది.
ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం ఒక్కో రైలు తయారీకి రూ.80 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. వీటి తయారీకి రూ.2,800 కోట్లను కేటాయించారు.
రోజుకు 3 వేల కిలోల హైడ్రోజన్ ఉత్స త్తి సామర్థ్యంతో ఒక ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. తర్వాత హిల్ స్టేషన్లలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు