గురుకుల ఉద్యోగాలలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు – హైకోర్టు

హైదరాబాద్ (సెప్టెంబర్ 18): తెలంగాణలోని వివిధ గురుకుల విద్యా సంస్థలలో భర్తీ చేయనున్న ఉద్యోగాల పోస్టుల భర్తీలో మహిళా రిజర్వేషన్ ను సమాంతరంగా అమలు (horizental reservations for women in gurukula notifications)చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

గురుకులాల్లో వివిధ కేటగిరీల్లోని 9,026 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (TREIRB) 9 నోటిఫికేషన్లు జారీచేసి ఇటీవల పరీక్షలు నిర్వహించింది.

వీటిలో మహిళలకు 79.78% పోస్టులు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై జస్టిస్ పీ. మాధవి దేవి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మొత్తం పోస్టుల్లో 79.78% మహిళలకే రిజర్వు చేయడంతో పురుష అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదించారు. దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ కోటానూ సమాంతరంగా అమలు చేయాలని కోరారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.