DSC (TRT) NOTIFICATION : నిబంధనలు, అర్హతలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 18) : తెలంగాణ రాష్ట్రంలో 5,085
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి జారీళచేసిన DSC (TRT) NOTIFICATION GUIDELINES and QUALIFICATIONS లో అభ్యర్థులు అర్హతలు, నిబంధనలు కింద విధంగా ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21 వరకు కలదు ప్రారంభం కానున్నది.

నవంబర్ 20 నుంచి 30 వరకు నియామక పరీక్షలు CBT పద్దతిలో జరుగుతాయి.

★ DSC (TRT) NOTIFICATION GUIDELINES and QUALIFICATIONS

SGT POSTS కు కేవలం DEd పూర్తి చేసినవారు మాత్రమే అర్హులు.

School assistant post లకు BEd సంబంధిత మెథడ్ లో పూర్తిచేసిన వారు అర్హులు. నాలుగేండ్ల బీఎడ్ పూర్తి చేసిన వారూ పోటీపడొచ్చు.

కోర్సుల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం, రిజర్వ్ క్యాటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

PET PISTS లకు అభ్యర్థులు ఇంటర్లో 50 శాతం మార్కుల తో ఉత్తీర్ణులై ఉండాలి. యూజీడీ పీఈడీ కోర్సు కూడా పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ అభ్యర్థులు బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

బీఎడ్, డీఎడ్ చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ చదివే అభ్యర్థులు సైతం దరఖాస్తులు సమర్పించవచ్చు.

దరఖాస్తు ఫీజుగా రూ.1,000/- అదనపు ఉద్యోగాలకు ఒక్కో దానికి రూ.1,000/- చొప్పున చెల్లించాలి.

అభ్యర్థులకు గరిష్ఠ వయో పరిమితి 01 జూలై – 2023 నాటికి 44 సంవత్సరాల వయసు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, మాజీ సైనికులకు 3, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5, దివ్యాంగులకు 10 ఏండ్ల వయో సడలింపు వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారమే వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

నియామక రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో అక్టోబర్ 20 నుంచి 30 వరకు నిర్వహిస్తారు.

సంగారెడ్డి పట్టణంతోపాటు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి.

దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థి విద్యార్హతలు, వ్యక్తిగత సమాచారం, ఫొటో, సంతకాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

TS TET, AP TET , లేదా సెంట్రల్ టెట్ (CTET) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

★ వెబ్సైట్ : https://schooledu.telangana.gov.in