UNSECO : ప్రపంచ వారసత్వ కట్టండంగా ‘శాంతినికేతన్’

కోల్‌కతా (సెప్టెంబర్ – 18) : శాంతినికేతన్ ను ప్రతిష్టాత్మక యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో (shantiniketan is UNESCO world heritage site ) చేర్చింది. పశ్చిమ బెంగాల్లోని చారిత్రక ప్రదేశం, ప్రఖ్యాత బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1863లో నిర్మించిన ఆశ్రమం ఇది. రవీంద్రనాధ్ ఠాగూర్ నిర్మించిన విశ్వ-భారతి విశ్వ విద్యాలయానికి నెలవైన శాంతినికేతన్ కు అరుదైన గౌరవం లభించింది.

★ శాంతినికేతన్ చరిత్ర

కోల్కతాకు సుమారు 160 కి.మీ. దూరంలో బోల్పుర్ పట్టణం సమీపంలో ఉన్న శాంతినికేతన్.. రవీంద్రుడి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1863లో నిర్మించిన ఆశ్రమం. భారత పునరుజ్జీవనోద్యమంలో కీలక పాత్ర పోషించిన దేవేంద్రనాథ్.. కులమతాలకు అతీతంగా ఎవరైనా ఇక్కడకు వచ్చి పరమాత్మ ధ్యానంలో గడిపేలా దీని నిర్మాణాన్ని చేపట్టారు.

ఇక్కడ తొలుత శాంతినికేతన్ గృహంతో పాటు ఒక అందమైన గాజు మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరంలో మతాలకు సంబంధం లేని ఆరాధన కొనసాగుతుండేది. తర్వాత ఈ ప్రాంతం శాంతినికేతన్ ఆశ్రమంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా బెంగాల్లో మతపరమైన ఆదర్శాల పునరుద్ధరణ, పునఃనిర్వచించిన ఉద్యమంలో ఈ రెండు నిర్మాణాలు ముఖ్యభూమిక పోషించాయి.

1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ ‘విశ్వ భారతి’ విద్యాలయాన్ని స్థాపించారు. భారతీయ విద్యావ్యవస్థలో ఇది చెరగని ముద్ర వేసింది. 1951లో దానికి కేంద్ర విశ్వవిద్యాలయ హోదా దక్కింది. పశ్చిమ బెంగాల్ ఈ హోదా పొందిన ఏకైక వర్సిటీ ఇది.

INDIAN HERITAGE SITES LIST