Home > EMPLOYEES NEWS > ఎన్నికలలో పాల్గొన్న ఉద్యోగులకు గౌరవ వేతనం

ఎన్నికలలో పాల్గొన్న ఉద్యోగులకు గౌరవ వేతనం

BIKKI NEWS (FEB. 06) : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికలలో విధులు నిర్వహించిన అన్ని రకాల ఉద్యోగులకు గౌరవ వేతనం (Honororium to Employees who worked for telangana assembly elections) చెల్లించాలని ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

నవంబర్ శాలరీ ఆధారంగా ఈ గౌరవ వేతనం చెల్లించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. నవంబర్ 30న ఓటింగ్ విధులు, డిసెంబర్ – 03న కౌంటింగ్ విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఈ గౌరవ వేతనం చెల్లించనున్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ గౌరవ వేతనం అందించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.