ఒడిశా (జనవరి – 29) : హాకీ పురుషుల ప్రపంచ కప్ 2023 విజేతగా జర్మనీ నిలిచింది. ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం పై ఫెనాల్టీ షూటౌట్ లో
ఆట ముగిసే సమయానికి 3-3 తో స్కోర్ తో సమం కావడంతో ఫెనాల్టీ షూటౌట్ లో 5-4 తేడాతో జర్మనీ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో హాకీ ప్రపంచ కప్ 3వ సారి జర్మనీ కైవసం చేసుకుంది.
మొదటి క్వార్టర్ ముగిసే సరికి 2-0 లీడ్ లో ఉన్న బెల్జియం, రెండో క్వార్టర్ ముగిసే సరికి జర్మనీ బెల్జియం ఆధిక్యాన్ని 2-1 కి తగ్గించి, మూడో క్వార్టర్ ముగిసే సరికి జర్మనీ బెల్జియం ఆధిక్యతను 2-2 కు సమం చేసింది. రెండవ, మూడవ క్వార్టర్ లో ఒక్క గోల్ కూడా బెల్జియం చేయకపోవడం విశేషం.
కీలకమైన నాలుగో క్వార్టర్ లో జర్మనీమరియు బెల్జియం జట్లు తలో గోల్ చేయడంతో ఆటముగిసే సమయానికి 3-3 తో స్కోర్ సమం కావడంతో ఫెనాల్టీ షూటౌట్ కి దారి తీసింది.