GROUP – 1 : మళ్ళీ నిర్వహించాల్సిందే – డివిజన్ బేంచ్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 27) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను (GROUP – 1 PRELIMS EXAM MUST RECONDUCT WITH BIOMETRIC ATTENDANCE) రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంజ్ సమర్ధించింది. మళ్లీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలను నియమ నిబంధనలకు అనుగుణంగా బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొని నిర్వహించాలని స్పష్టం చేసింది.

గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డివిజన్ బెంజ్ సింగిల్ జడ్జ్ తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనర్హం.

ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయని ఆసక్తిగా మారింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించడమా లేదా తిరిగి పరీక్షలు నిర్వహించడమా అనేది తేలాల్సి ఉంది.