T20 CRICKET : వేగవంతమైన సెంచరీ, అర్థ సెంచరీ రికార్డ్స్ బ్రేక్

హాంగ్జౌ (సెప్టెంబర్ – 27) : ASIAN GAMES 2023 లో భాగంగా నేపాల్ – మంగోలియా (Nepal vs Mongolia) క్రికెట్ జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్ లో అత్యంత వేగవంతమైన అంతర్జాతీయ సెంచరీ రికార్డు, (fastest t20 century record) మరియు అత్యంత వేగంవంతమైన అర్ధ సెంచరీ రికార్డుల రెండు నేపాల్ బ్యాట్స‌మన్ ధాటికి బద్దలయ్యాయి.

రోహిత్ శర్మ పేరు మీద ఉన్న అత్యంత వేగవంతమైన సెంచరీ (35 బంతుల్లో) రికార్డు ను నేపాల్ బ్యాట్స‌మన్ కుశాల్ మల్ల (kushal Malla) 34 బంతుల్లో సెంచరీ చేసి బ్రేక్ చేశాడు.

అలాగే అంతర్జాతీయ టి20 అత్యంత వేగవంతమైన అర్ద సెంచరీ (fastest t20 half century record) రికార్డు (12 బంతుల్లో) యువరాజ్ సింగ్ పేరు మీద ఉండగా… దానిని నేపాల్ మరో బ్యాట్స‌మన్ దీపేంద్రసింగ్ (Dipendra singh) 9 బంతుల్లోనే అర్ద సెంచరీ చేసి రికార్డు బద్దలు కొట్టాడు.

ఓకే మ్యాచ్ లో భారత బ్యాట్స‌మన్ పేరు మీద ఉన్న రెండు అంతర్జాతీయ రికార్డులు బద్దలవ్వడం విశేషం.