న్యూఢిల్లీ (నవంబర్ – 12) : చిరుధాన్యాలపై రూపొందించిన ‘అబెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాటకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహయంతో పోషకాల సమృద్ధి అంటూ పాటను రచించి, ప్రదర్శించిన ముంబయి గాయని, గేయ రచయిత ఫాల్గునీ షా, ఆమె భర్త గౌరవ్ షా ప్రపంచ ప్రఖ్యాత 66వ ‘గ్రామీ అవార్డు’కు నామినేట్ (MODI MILLET SONG – GRAMMY AWARDS)అయ్యారు. ఈ అవార్డులను ఫిబ్రవరి 04 – 2024 లో ప్రకటించనున్నారు.
2023న ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ఐరాస ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని పాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు పాటను రూపొందించారు.