హైదరాబాద్ (జనవరి 12) : 80వ గోల్డెన్ గ్లోబ్ 2023 (80th Golden Globe Awards – 2023 winners list) అవార్డుల్లో విజేతల జాబితాను పోటీ పరీక్షా నేపథ్యంలో ఇవ్వడం జరిగింది. ఆస్కార్ అవార్డ్స్ తర్వాత సినిమా, టీవీ రంగంలో అంతటి ప్రాధాన్యం గల గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. 2022 సంబంధించిన చిత్రాలకు ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది.
తెలుగు సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో మెరిసింది. రాజమౌళి చెక్కిన RRR సినిమాలోని కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కించుకోవడం విశేషం.
ఉత్తమ చిత్రంగా ది ఫ్యాబ్‌ల్మాన్, ఉత్తమ దర్శకుడుగా స్పీల్ బర్గ్, ఉత్తమ నటుడిగా అస్టిన్ బట్లర్, ఉత్తమ నటిగా కేట్ బ్లాంచట్, ఉత్తమ విదేశీ చిత్రంగా అర్జెంటీనా -1985 నిలిచాయి.
★ పూర్తి జాబితా :
◆ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు – (MM కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ)
◆ ఉత్తమ చిత్రం (డ్రామా మోషన్) : ది ఫాబెల్మాన్స్
◆ ఉత్తమ నటుడు (డ్రామా మోషన్ పిక్చర్‌లో)
ఆస్టిన్ బట్లర్ – (ఎల్విస్)
◆ ఉత్తమ నటి (డ్రామా మోషన్ పిక్చర్) : కేట్ బ్లాంచెట్ –
(తారు)
◆ ఉత్తమ చలనచిత్ర దర్శకుడు : స్టీవెన్ స్పీల్‌బర్గ్ (ది ఫాబెల్మాన్స్)
◆ ఉత్తమ విదేశీ భాషా చిత్రం : అర్జెంటీనా – 1985
◆ సెసిల్ బి. డిమిల్లే అవార్డు : ఎడ్డీ మర్ఫీ
◆ కరోల్ బర్నెట్ అవార్డు : ర్యాన్ మర్ఫీ
◆ ఉత్తమ స్క్రీన్ ప్లే : బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్ –
(మార్టిన్ మెక్‌డొనాగ్)
◆ ఒరిజినల్ స్కోరు : బాబిలోన్ (జస్టిన్ హర్విట్జ్)
◆ ఉత్తమ సంగీత లేదా హాస్య చలన చిత్రం : బన్షీసీస్ ఆఫ్ ఇనిషెరిన్
◆ ఉత్తమ నటి (మ్యూజికల్ లేదా కామెడీ మోషన్ పిక్చర్) :
మిచెల్ యోహ్. (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ యట్ ఏ వన్స్)
◆ ఉత్తమ డ్రామా TV సిరీస్ : హౌస్ ఆఫ్ ది డ్రాగన్
◆ ఉత్తమ సహాయ నటి చలన చిత్రం :
ఏంజెలా బాసెట్ – (బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్)
◆ ఉత్తమ నటుడు ( సంగీత లేదా హాస్య చిత్రం) : కోలిన్ ఫారెల్ (బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
◆ ఉత్తమ సహాయ నటుడు : కే హుయ్ క్వాన్
(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ యట్ ఏ వన్స్)
◆ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : పినోచియో
◆ ఉత్తమ నటి (డ్రామా TV సిరీస్) : జెండాయ (యూరోపియా)
◆ ఉత్తమ నటి ( మ్యూజికల్ లేదా కామెడీ టీవీ సిరీస్) ):
క్వింటా బ్రన్సన్ (అబాట్ ఎలిమెంటరీ)
◆ ఉత్తమ సంగీత లేదా కామెడీ TV సిరీస్ : అబాట్ ఎలిమెంటరీ
◆ ఉత్తమ నటుడు ( మ్యూజికల్ లేదా కామెడీ టీవీ సిరీస్) : జెరెమీ అలెన్ వైట్
◆ ఉత్తమ నటుడు ( డ్రామా TV సిరీస్) : కెవిన్ కాస్ట్నర్ (ఎల్లోస్టోన్)
◆ ఉత్తమ మినిసిరీస్ లేదా టీవీ ఫిల్మ్. : ది వైట్ లోటస్
◆ ఉత్తమ నటి (TV కోసం మినీ-సిరీస్ లేదా మోషన్ పిక్చర్) : అమండా సెయ్ ఫ్రిడ్. (డ్రాప్అవుట్)
◆ ఉత్తమ నటుడు (TV మినీ-సిరీస్ లేదా మోషన్ పిక్చర్) :vఇవాన్ పీటర్స్ (డహ్మెర్ – మాన్స్టర్: ది జెఫ్రీ డామర్ స్టోరీ)
◆ ఉత్తమ సహాయ నటి (TV కోసం రూపొందించబడిన పరిమిత సిరీస్/సంకలనం లేదా చలనచిత్రం) :
జెన్నిఫర్ కూలిడ్జ్ (ది వైట్ లోటస్)
◆ ఉత్తమ సహాయ నటుడు ₹TV సిరీస్/మ్యూజికల్-కామెడీ లేదా డ్రామా) : టైలర్ జేమ్స్ విలియమ్స్
(అబాట్ ఎలిమెంటరీ)
◆ ఉత్తమ సహాయ నటుడు (టీవీ కోసం రూపొందించిన పరిమిత సిరీస్/సంకలనం లేదా చలనచిత్రం) :
పాల్ వాల్టర్ హౌసర్. (బ్లాక్ బర్డ్)
◆ ఉత్తమ సహయ నటి ( TV సిరీస్/మ్యూజికల్-కామెడీ లేదా డ్రామా) : జూలియా గార్నర్. (ఓజార్క్)
Comments are closed.