జీజేసి హయత్‌నగర్ – ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సహయం

హయత్‌నగర్ (అక్టోబర్ – 13) : ప్రభుత్వ జూనియర్ కళాశాల హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా నందు జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో భాగముగా 2022-23 విద్యా సంవత్సరం నందు బైపీసీ గ్రూపులో అత్యధిక మార్కులు(983/1000) సాధించిన కళాశాల విద్యార్థిని సోనికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎం. శ్రీదేవి గారు 5,000 రూపాయలు నగదు రూపంలో విద్యార్థినికి అందజేశారు.

అదేవిధంగా ఐఐటి జమ్ము నందు సీటు సాధించిన శ్రీరామ్ నరేష్ కు 5,000 రూపాయలు నగదుతో, పాటు కళాశాలలోని అన్ని గ్రూపుల నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా నగదు రూపంలో బహుమతులను ప్రిన్సిపాల్ గారు అందజేశారు… విద్యార్థులు

ఈరోజు కళాశాల నందు నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో భాగంగాచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీదేవి గారిని విద్యార్థులు మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం ఘనంగా సన్మానించడం జరిగింది.