GI TAG – హైదరాబాద్ లక్క గాజులకు జీఐ ట్యాగ్

BIKKI NEWS ( MARCH – 03) : హైదరాబాద్ లాడ్ బజార్ లో తయారయ్యే లక్క గాజులకు జియొగ్రాపికల్ ఇండికేషన్ (GI TAG FOR LAC BANGLES OF HYDERABAD) గుర్తింపును ఇచ్చారు. ఈ గుర్తింపు వలన ప్రపంచ వ్యాప్తంగా ఈ గాజులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ నుండి 17 వస్తువులకు జీఐ ట్యాగ్ లభించింది.

◆ LAC BANGLES OF HYDERABAD

హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలోని లాడ్ బజార్ లో ఈ లక్క గాజులను చేతులతోని నిపుణులు తయారు చేస్తారు. కుతుబ్ షాహీ ల కాలంలో ఈ కళ అభివృద్ధి చెందినట్లు చరిత్రకారుల అభిప్రాయం.

ఈ గాజులను పెళ్ళిళ్ళు, వేడుకలకం మహిళలు ధరించడం ఆనవాయితీ. హైదరాబాద్ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఈ లక్క గాజులను పేర్కొనవచ్చు.