కొత్తగూడెంకు వాల్యుయేషన్ క్యాంప్ రావడం సంతోషం – MLA కూనంనేని

కొత్తగూడెం (మార్చి – 03) : కొత్తగూడెం పట్టణంలోని స్థానిక సింగరేణి జూనియర్ మహిళా కళాశాలలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (475 అసోసియేషన్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడుతూ
కొత్తగూడెం పట్టణంలో సింగరేణి కాలరీస్ మహిళ జూనియర్ కాలేజీలో ఇంటర్ స్పాట్ వేల్యూషన్ క్యాంపు రావడం చాలా సంతోషమని, అధ్యాపకుల కోరిక మేరకు ప్రభుత్వం మరియు ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం చేయటం చాలా మంచి నిర్ణయమని, ఈ క్యాంపును విజయవంతం చేయడానికి అధ్యాపకులు అందరూ కృషి చేయాలనితెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీమతి సులోచన రాణి గారు మాట్లాడుతూ బలరాం నాయక్, ఐ ఆర్ ఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ వి కె శ్రీనివాస్ డైరెక్టర్ ( ఎస్సిసిఎల్ ) సింగరేణి లిమిటెడ్ వెంకటేశ్వరరావు, జీఎం ఎడ్యుకేషన్ SCCL గారి సహకారంతో ఇంటర్ స్పాట్ క్యాంపు ఏర్పాటు చేయటం జరిగిందని దీనివలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ, సోషల్ వెల్ఫేర్, కేజీబీవి, మోడల్ స్కూల్, ప్రైవేట్ మొదలైన 170 జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 900 మంది అధ్యాపకులకు ఈ క్యాంపు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని భావించి ఇంటర్ బోర్డు అధికారులు ఈ కళాశాలలో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు.

కళాశాల కరస్పాండెంట్ శ్రీమతి నికోలస్ గారు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సంధ్యారాణి గారు, ప్రిన్సిపల్ అసోసియేషన్ నాయకులు శేషు బాబు గారు, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జాస్తి రమేష్ గారు, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఉదయ భాస్కర్, గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా నాయకులు విజయకుమార్, 475 రాష్ట్ర మహిళా కార్యదర్శి షాహినా సుల్తానా, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ 475 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నందికొండ వెంకన్న, తోర్తి జాన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగేశ్వరరావు,.రాష్ట్ర కౌన్సిలర్స్ రవీంద్రబాబు, లక్ష్మీనారాయణ కోశాధికారి దుమ్ముగూడెం శ్రీనివాస్, 475 సంఘ ఖమ్మం జిల్లా నాయకులు బండి ఈశ్వర్, వివిధ సంఘాల నాయకులు బండి వెంకటేశ్వర్లు, బాలస్వామి, శ్రీను, బండి లక్ష్మణ్, వివిధ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని క్యాంపు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కార్యదర్శి శ్రీమతి శృతి ఓజ మేడం గారికి తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీమతి జయప్రద మేడం గారికి మరియు ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ., 475 అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగేశ్వరావు, మరియు షాహినా సుల్తానా వచ్చిన అతిథులందరికీ అధ్యాపకులకి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.