BIKKI NEWS : మహత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చి స్వతంత్ర పోరాటంలో శాంతి యుత పద్దతులలో ఉద్యమాలు (Gandhi agitations list for freedom) చేయడం ప్రారంబించారు.. పోటీ పరీక్ష నేపథ్యంలో ఉద్యమ నేపథ్యం, ఉద్యమ సంవత్సరం, ఉద్యమ అంశం వంటి అంశాల మీద పలు ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో ఆ ఉద్యమాల గురించి క్లుప్తంగా…
★ చంపారన్ సత్యాగ్రహం (బీహార్) (1917)
బీహార్ ప్రాంతంలోని రైతులు తమ భూమిలో 2/3 వంతు భాగంలో నీలిమందు పంట సాగు చేయాలని బ్రిటీష్ అధికారులు ఒత్తిడి చేశారు. దీని మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారి కష్టాలు తీర్చటానికి రాజ్ కుమార్ శుక్లా ఆహ్వానం మేరకు గాంధీ ఈ ఉద్యమం చేపట్టారు. దేశంలో గాంధీ చేపట్టిన మొదటి సత్యాగ్రహం,
★ ఖేడా ఉద్యమం (గుజరాత్) (1918)
గుజరాత్ లోని ఖేడా ప్రాంతంలో కరువు వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతి న్నాయి. ఈ సందర్భంలో భూమి శిస్తు చెల్లింపులో రైతులకు మినహాయింపు ఉన్నా.. శిస్తు చెల్లించాలంటూ బ్రిటీష్ అధికారులు రైతులను ఒత్తిడి చేశారు. రైతులకు న్యాయం చేయటానికి మహాత్మా గాంధీ ఉద్యమం చేపట్టారు.
★ సహాయ నిరాకరణోద్యమం :- (1920 – 22)
దేశవ్యాప్తంగా జరిగిన మొట్టమొదటి ఉద్యమం ఇది. బ్రిటీష్ ప్రభుత్వానికి సహాయం నిరాకరించటం ద్వారా స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని భావించి గాంధీజీ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. యూపీలోని చౌరీచౌరాలో జరిగిన హింసాత్మక ఘటనతో గాంధీజీ ఈ ఉద్యమాన్ని నిలిపేశారు.
★ శాసనోల్లంఘనోద్యమం/ఉప్పు సత్యాగ్రహం :- (1930 – 34)
1930 మార్చి 12న గాంధీ గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో దండి యాత్ర ప్రారంభించారు. ఇందులో ఆంధ్రప్రాంతం నుంచి ఎర్నేని సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 1980 ఏప్రిల్ 6న దండి చేరుకుని గాంధీ ఉప్పు తయారుచేసి చట్టాలను ఉల్లంఘించారు. ఆంధ్రాలో ఈ ఉద్యమానికి మార్గదర్శిగా కొండా వెంకటప్పయ్యను నియమించారు.
★ క్విట్ ఇండియా ఉద్యమం :- (1942)
ఈ ఉద్యమం సందర్భంగా డూ ఆర్ డై అనే నినాదాన్ని గాంధీ ఇచ్చారు. ఆయన చేపట్టిన చివరి ఉద్యమం ఇది.
- GK BITS IN TELUGU 10th OCTOBER
- చరిత్రలో ఈరోజు అక్టోబర్ 10
- RRB JOBS – ఇంటర్ తో రైల్వేలో 3445 ఉద్యోగాలు
- RRB NTPC JOBS – డిగ్రీతో 8,113 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ANGANWADI JOBS – అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్