Gallantry awards – వీర సైనికులకు అందించే అవార్డుల పూర్తి వివరణ

BIKKI NEWS : భారతదేశం అన్ని రకాల ర్యాంకింగ్ లు కలిగిన సైనికులకు(ఆర్మీ, నావీ, ఎయిర్ పోర్స్) యుద్ధం, శాంతి సమయాలలో అత్యున్నత దైర్య సహసాలు చూపించినందుకు జనవరి 26 మరియు ఆగస్టు 15 న గ్యాలంటరీ అవార్డులను( gallantry awards in india in telugu) రాష్ట్రపతి అందిస్తారు.

Gallantry Awards in India in telugu

యుద్ధ సందర్భంగా :-

భారత దేశ సైనికులకు ఇచ్చే అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : పరమవీర చక్ర

2వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : మహావీరచక్ర

3వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : వీరచక్ర

శాంతి సందర్భంగా :

1వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : అశోకచక్ర (4వ)

2వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : కీర్తి చక్ర(5వ)

3వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : శౌర్య చక్ర (6వ)

■ యుద్ధ సమయంలో అత్యున్నత పురష్కారాలు :-

★ పరమవీరచక్ర :- ఇది భారత్ లో అత్యున్నత సైనిక పురస్కారం

కాంస్యంతో వృత్తాకారంలో తయారు చేయబడిన ధైర్యసాహసాలకిచ్చే అత్యుత్తమ భారతీయ అవార్డు పరమవీరచక్ర అవార్డును ఊదారంగు రిబ్బన్లో అలంకరిస్తారు.

ఇంద్రుడి వజ్రాయుధాన్ని పోలిన ఆయుధాలు 4 వైపులా ఉండి మధ్యలో జాతీయ చిహ్నాన్ని కలిగి ఉండే అవార్డు. పరమవీరచక్ర అవార్డు పొందిన మొదటివ్యక్తి – మేజర్ సోమనాధశర్మ(1947 నవంబర్ 3)

★ మహావీరచక్ర :- ఈ అవార్డును వెండితో తయారు చేస్తారు. – ఈ అవార్డును సగం తెలుపు, సగం నారిజరంగు గల రిబ్బన్ తో అలంకరిస్తారు.

★ వీర్ చక్ర :- ఈ అవార్డుకు మధ్యలో అశోక చక్రం ఉంటుంది.

  • ఈ అవార్డును కూడా వెండితో తయారు చేస్తారు.

■ శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పురష్కారాలు :

★ అశోక చక్ర :- యుద్ధం జరగని సమయంలో, శాంతి సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇస్తారు.

  • అశోక చక్ర అవార్డును పచ్చటి సిల్కు రిబ్బన్లో అలంకరిస్తారు.

ఈ అవార్డు పొందిన తొలి మహిళ : కమలేష్ కుమారి. అవార్డు మధ్యలో అశోక చక్రం ఉంటుంది గిట్టు బంగారంతో చేసిన జ్ఞాపికను ఇచ్చే అవార్డు.

★ కీర్తి చక్ర, శౌర్యచక్ర :- ఈ అవార్డులను అశోక చక్ర అవార్డువలె పచ్చటి సిల్కు రిబ్బన్ లో అలంకరిస్తారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు