బౌద్ధ, జైన సంగీతుల విశ్లేషణ

BIKKI NEWS :. భారత దేశ చరిత్రలో బౌద్ధ మతం, జైన మతం మధ్యయుగం నాటికి పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిల వరకు విస్తరించి ప్రధాన మతాలుగా అభివృద్ధి చెందాయి. (buddhist and jain sangeeths list and explanation)

ఈ మతాలకు సంబంధించిన వివరాలు పోటీ పరీక్షలలో తరచుగా అడగటంతో… బౌద్ధ, జైన సంగీతుల గురించి సంక్షిప్తంగా నేర్చుకుందాం.

buddhist and jain sangeeths list and explanation

★ బౌద్ధ సంగీతులు

● మొదటి సంగీతి :-

  • సంవత్సరం :- క్రీ.పూ. 483,
  • ప్రాంతం :- రాజ గృహం
  • రాజు :- అజాత శత్రువు
  • అధ్యక్షుడు :- మహ కాశ్యప
  • ప్రాధాన్యత :- వినయ‌, సుత్త అనే పీఠికలు (నియమావళి గ్రంధాల) సంకలనం

● రెండవ సంగీతి :-

  • సంవత్సరం :- క్రీ.పూ. 383,
  • ప్రాంతం :- వైశాలి
  • రాజు :- కాలశోకుడు
  • అధ్యక్షుడు :- సర్వకామిని
  • ప్రాధాన్యత :- బౌద్ధ సంఘం ధేరవాదులు, మహ సాంఘీకులుగా చీలిపోయింది.

● మూడవ సంగీతి :-

  • సంవత్సరం :- క్రీ.పూ. 253,
  • ప్రాంతం :- పాటలీపుత్రం
  • రాజు :- అశోకుడు
  • అధ్యక్షుడు :- మొగలి పుత్రతిస్స
  • ప్రాధాన్యత :- అభిదమ్మ పీఠకాన్ని రచించారు.

● నాలుగో సంగీతి :-

  • సంవత్సరం :- క్రీ.శ. 1వ శతాబ్దం
  • ప్రాంతం :- కుందల వనం (కాశ్మీర్)
  • రాజు :- కనిష్కుడు
  • అధ్యక్షుడు :- వసుమిత్రుడు
  • ప్రాధాన్యత :- బౌద్ధ మతం మహయాన, హీనయాన శాఖలుగా విడిపోయింది.

★ జైన సంగీతులు :-

● మొదటి సంగీతి :-

  • సంవత్సరం :- క్రీ.పూ. 3వ శతాబ్దం
  • ప్రాంతం :- పాటలీ పుత్రం
  • రాజు :- చంద్రగుప్త మౌర్యుడు
  • అధ్యక్షుడు :- బద్ర బాహుడు, స్థూల భద్రుడు
  • ప్రాధాన్యత :- జైన బోధనలను 12 అంగాలుగా విభజించడం జరిగింది. దిగంబర, శ్వేతాంబరులుగా విడిపోయారు.

● రెండవ సంగీతి :-

  • సంవత్సరం :- క్రీ.శ. 512
  • ప్రాంతం :- వల్లభి (గుజరాత్)
  • రాజు :- —–
  • అధ్యక్షుడు :- దేవర దిక్షమ (శ్రమణుడు)
  • ప్రాధాన్యత :- అంగాలను అర్ధమగాది బాషలో రాసుకున్నారు. 12 అంగాలు, ఉపాంగాల సంకలనం పూర్తి అయింది. గంధర్వ అనే పవిత్ర గ్రంధాలు క్రమానుసారంగా రాసుకున్నారు. శిల్ప కళను అభివృద్ధి చేశారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు