Free Coaching – బ్యాంకు జాబ్స్ కు జిల్లా కేంద్రాలలో ఉచిత వసతి, కోచింగ్

హైదరాబాద్ (అక్టోబర్ – 04) : IBPS PO and CLERK JOBS FREE COACHING IN TELANGANA STUDY CIRCLES – బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉచిత వసతి, కోచింగ్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఆసక్తి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోపు ఎస్టీ స్టడీ సర్కిల్ ఆన్లైన్ వెబ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

డిగ్రీ అర్హత కలిగి ఉండి 18 సంవత్సరాలు నిండిన అభ్యర్దులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులకు కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు
ఉండాలని, ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో రెండునెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడుపు అక్టోబర్ 10 వరకు కలదు

మరిన్ని వివరాలకు 040 – 27540104 ఫోన్ నంబర్ కార్యాలయ పనివేళ్లలో ఫోన్ చేసి సంప్రదించాలని సూచించింది.

వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/tstw/Index.do