BSc Agriculture Admissions : 6,7 తేదీల్లో కౌన్సెలింగ్

హైదరాబాద్ (అక్టోబర్ – 04) : వనపర్తి, కరీంనగర్ లలో ఉన్న
ఉమెన్ రెసిడెన్షియల్ కాలేజీల్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి అక్టోబర్ 6,7 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంసెట్- 2023 బైపీసీ స్ట్రీమ్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు వెంటనే మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల సొసైటీ వెబ్సైట్ లో వివరాలను పరిశీలించాలన్నారు.

రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం క్యాంపస్ లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో అక్టోబర్ 6న ఉదయం 9.30 నుంచి, మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు విడతలుగా కౌన్సెలింగ్ జరుగుతుందని,ళ7వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

కౌన్సెలింగ్ కు హాజరయ్యే విద్యార్థులంతా తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

వెబ్సైట్ : https://mjptbcwreis.telangana.gov.in/