FRANCE TOUR OF MODI : ప్రధాని ప్రాన్స్ పర్యటన విశేషాలు

పారిస్ (జూలై – 16) : బాస్టిల్ డే 2023 సందర్భంగా జూలై 14న నిర్వహిస్తున్న ప్రాన్స్ దేశ జాతీయ దినోత్సవం గౌరవ అతిధిగా ప్రధాన నరేంద్ర మోడీ జులై 13, 14 వ తేదీలలో పర్యటించారు.

ఫ్రాన్స్ దేశం బాస్టిల్ డే జరుపుకునే జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా హాజరైన అతి కొద్దిమంది ప్రపంచ స్థాయి నేతలలో నరేంద్ర మోడీ ఒకరిగా నిలిచారు.

ఐరోపాలానే అతిపెద్ద కవాతుగా పేరుగాంచిన బాస్టిల్ డే పరేడ్ లో భారత సైనికులు పాల్గొన్నారు. 269 మందితో కూడిన భారత త్రివిధ దళాల బృందం ప్రాన్స్ సైనిక దళాలతో కలిసి కవాతు చేసింది.

★ మోడీకి ప్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రాన్స్ దేశ అత్యున్నత పౌర, సైనిక పురస్కారం “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజెండ్ ఆఫ్ హనర్” తో ప్రాన్స్ దేశం సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు మోదీనే.

★ మోదీ – మక్రాన్ మద్య కుదిరిన ఒప్పందాలు

భారతదేశం & ప్రాన్స్ సంయుక్తంగా యుద్ధ విమాన ఇంజన్ల అభివృద్ధికి ఒప్పందం.

రక్షణ ఉత్పత్తుల రంగంలో తమ సహకారాన్నిని మరింతగా విస్తరించుకోవాలని భారత్ – ప్రాన్స్ నిర్ణయించాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల సంయుక్తంగా అభివృద్ధి చేయడంతో పాటు భారత నౌకాదళం కోసం మూడు స్కార్పియో జలంతర్గాములను నిర్మించే ప్రాజెక్టులకు అవగాహనకు వచ్చాయి.

అలాగే భారత యూపీఐ పేమెంట్స్ ను ఫ్రాన్స్ లో కూడా అనుమతికి ఒప్పందం కుదిరింది.

భారత్ ప్రాన్స్ దేశాల చమురు కంపెనీలైన ఐఓసి – టోటల్ మధ్య కూడా దీర్ఘకాల ఒప్పందం కుదిరింది

పారిస్ లోని భారత దౌత్య కార్యాలయంలో డిఆర్డిఓ టెక్నికల్ ఆఫీసర్ భారత్ ఏర్పాటు చేయనుంది.

★ మోదీ అందించిన బహమతి

ప్రధాని నరేంద్ర మోడీ ప్రాన్స్ అధ్యక్షుడు సతీమణి కు తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక గ్రామంలో తయారు చేసిన చేనేత చీర అయినా “దుబియన్ చీర”ను బహుమతిగా అందజేశారు.

★ మోడీ అందుకున్న బహుమతులు

1916 నాటి సిక్కు సైనిక అధికారి ప్రతిరూపాన్ని అందజేశారు.

11 వ శతాబ్దం నాటి చదరంగపావుల చార్లే మాగ్నే (చెస్ మాన్) నమూనా అందజేశారు

మంచి సాహిత్యంలో అత్యధిక ప్రాచుర్యం పొందిన మార్షల్ పోస్ట్ 1913 నుండి 27 మధ్య రచించిన నవల “ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైం” ను అందజేశారు.