Home > CURRENT AFFAIRS > WIMBLEDON 2023 FINAL విజేత అల్కరాస్

WIMBLEDON 2023 FINAL విజేత అల్కరాస్

BIKKI NEWS (జూలై – 16) : WIMBLEDON 2023 MEN’S SINGLES FINAL లో నెంబర్ వన్ అల్కరాస్ దిగ్గజ ఆటగాడు జకోవిచ్ పై సంచలన విజయం సాదించాడు. 1-6, 7-6 (8-6), 6-1, 3- 6, 6- 4 తేడాతో సంచలన విజయం సాధించాడు.

ప్రపంచ నెంబర్ వన్ అల్కరాస్ మరియు అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జకోవిచ్ WIMBLEDON 2023 FINAL మ్యాచ్ లో హోరాహోరీగా తలపడ్డారు.. అయినా యువ సంచలనం జకోవిచ్ 24వ టైటిల్ ఆశలను నీరుగారుస్తూ వింబుల్డన్ 2023 విజేతగా నిలిచాడు.

స్పెయిన్ కు చెందిన కార్లోస్ అల్కరాస్ గార్ఫియా కు ఇది రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్, 2022 US open విజేతగా అల్కరాస్ నిలిచాడు.

★ మొదటి సెట్ జకో దే

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో మొదటి రౌండ్ ను జకోవిచ్ సునాయాసంగా 32 నిమిషాలలోనే కైవసం చేసుకున్నాడు. జకో 6 పాయింట్లు సాదిస్తే అల్కరాస్ కేవలం 1 పాయింట్ మాత్రమే సాదించాడు. దీంతో 1-0 తేడాతో ముందు నిలిచాడు.

★ రెండో సెట్ హోరాహోరీలో అల్కరాస్ దే పైచేయి

రెండో రౌండ్లో ఓర ఓరియా పోరు సాగింది మొదటి రౌండ్లో వెనుకబడ్డ అల్కరాజ్ రెండో రౌండ్లో జకోవిచ్ కు చుక్కలు చూపించాడు. రెండో రౌండ్ లో 7 – 6 తో అల్కరాస్ నిలుచి 8- 6 తేడాతో రెండో సెట్ కైవసం చేసుకుని స్కోర్ ను 1-1 తో సమం చేశాడు.

★ మూడో రౌండ్ లో చిత్తైన జకోవిచ్

మూడో రౌండ్లో అల్కరాస్ విశ్వరూపాన్ని చూపించాడు. జకోవిచ్ కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా 6 -1 తేడాతో మూడో సేట్ ను గెలుచుకున్నాడు. దీంతో 2-1 తేడాతో ముందు నిలిచాడు. ఈ సెట్ లో ఐదవ పాయింట్ కోసం 13 డ్యూస్ ఏర్పడటం ఇద్దరి మధ్య హోరాహోరీని సూచిస్తుంది.

★ నాలుగో సెట్ జకో దే

నాలుగో రౌండ్లో జకోవిచ్ తన పోరాటాన్ని తిరిగి ప్రారంభించాడు. 6 – 3 తేడాతో స్కోర్ ను 2-2 తో సమం చేశాడు. దీంతో మ్యాచ్ కీలకమైన ఐదో సెట్ కు దారితీసింది. ఈ ఐదో సెట్ లో నెగ్గిన ఆటగాడు వింబుల్డన్ 2023 విజేతగా నిలవనున్నాడు.

★ ఐదో సెట్ & టైటిల్ అల్కరాస్ దే

కీలకమైన ఐదో సెట్ లో పట్టు విడువని అల్కరాస్ జకోవిచ్ 24వ టైటిల్ ఆశలపై నీళ్ళు చల్లుతూ విజృంభించి ఆడాడు. సెట్ ను 6 – 4 తేడాతో నెగ్గాడు. వింబుల్డన్ 2023 విజేతగా నిలిచాడు.