వన్డేలలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు

BIKKI NEWS : భారత్ బంగ్లాదేశ్ జట్ల మద్య జరిగిన మూడో వన్డేలో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. వన్డే లలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు.

కేవలం 126 బంతుల్లో 200 పరుగులు సాదించి క్రిస్ గేల్ జింబాబ్వే పై 138 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన రికార్డు ను బ్రేక్ చేశాడు.

మొత్తం మీద అంతర్జాతీయ వన్డేలలో ఇప్పటి వరకు 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా అందులో 7 సార్లు భారత్ బ్యాట్స్‌మన్ లే ఉండడం విశేషం. రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీలు సాదించడమే కాక అత్యధిక వన్డే స్కోర్ (264) రికార్డు కూడా తన పేరునే ఉంది.

◆ వన్డే డబుల్ సెంచరీలు

1) రోహిత్ శర్మ – 264 (శ్రీలంక)

2) గుప్తిల్ – 237* (వెస్టిండీస్)

3) వీరేంద్ర సెహ్వాగ్ – 219 (వెస్టిండీస్)

4) క్రిస్ గేల్ – 215 (జింబాబ్వే)

5) ఫకర్ జమాన్ – 210* (జింబాబ్వే)

6) ఇషాన్ కిషన్ – 210 (బంగ్లాదేశ్)

7) శుభమన్ గిల్ – 208 (న్యూజిలాండ్)

8) రోహిత్ శర్మ – 209 (ఆస్ట్రేలియా)

9) రోహిత్ శర్మ – 208* (శ్రీలంక)

10) సచిన్ టెండూల్కర్ – 200* (సౌతాఫ్రికా)