GI TAG : తాండూరు కందిపప్పుకు భౌగోళిక గుర్తింపు

హైదరాబాద్ (డిసెంబర్ – 14) : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన తాండూరు కందిపప్పునకు (Tandur Redgram) భౌగోళిక గుర్తింపు (GI tag) లభించినట్లు కేంద్రం వెల్లడించింది.

దీంతో పాటు అస్సాం గమోసా, లద్దాఖ్ యాప్రికాట్, మహారాష్ట్రకు చెందిన అలీబాగ్ వైట్ ఆనియన్ లకు కూడా జీఐ ట్యాగ్ లభించిందని వాణిజ్య పరిశ్రమల శాఖ తెలియజేసింది. వీటితో దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు పొందిన వాటి సంఖ్య 432కి చేరిందని పేర్కొంది.

ఇంతకు ముందు జీఐ ట్యాగ్ పొందినవి

దేశంలో బాస్మతి రైస్, డార్జిలింగ్ టీ, చందేరి ఫ్యాబ్రిక్కు, మైసూర్ సిల్క్, కాంగ్రా టీ.. ఇలా చాలా వాటికి ఈ జీఐ ట్యాగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బనగానపల్లి మామిడి, బొబ్బిలి వీణ, ధర్మవరం చేనేత పట్టుచీరలు, నిమ్మలకుంట తోలుబొమ్మలు, ఉప్పాడ జామ్హానీ చీరలు, తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, హైదరాబాద్ లాడ్ బజార్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

జీఐ ట్యాగ్ సాధించిన రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, కేరళ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు