Home > CURRENT AFFAIRS > AWARD : నటేశ్వర శర్మకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు 2023

AWARD : నటేశ్వర శర్మకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు 2023

హైదరాబాద్ (జూలై – 19) : శ్రీ దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా వారి పేరుతో ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక “శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును” 2023 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని, కామారెడ్డి జిల్లాకు చెందిన శ్రీ అయాచితం నటేశ్వర శర్మకు (Dasarathi krishnamacharya award 2023) ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అవార్డుతో పాటు 1,01,116 రూపాయల నగదును, శాలువా, జ్ఞాపికను ఈ నెల 22వ తేదీన రవీంద్ర భారతిలో జరిగే శ్రీ కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా అవార్డు గ్రహీతకు అందజేస్తారు.

ఈ సందర్భంగా శ్రీ ఆయాచితం నటేశ్వర శర్మకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.