డా. సినారె జాతీయ సాహిత్య అవార్డు : జావేద్ అక్తర్ ఎంపిక

హైదరాబాద్ (జూలై – 09) : డా. సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురష్కారం 2023 కు ప్రముఖ హిందీ సినీ కవి రచయిత జావేద్ అక్తర్ కు అందించాలని కమిటీ నిర్ణయించింది.

జూలై 29న డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని జావేద్ అక్తర్ కు అందించనున్నారు.

జావేద్ అక్తర్ 5 సార్లు ఉత్తమ జాతీయ గీత రచయిత అవార్డులను, 6 సార్లు ఉత్తమ గీత రచన ఫిలింఫేర్ అవార్డులను, 4 సార్లు ఉత్తమ స్క్రిప్ట్ రచయిత ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు.