పూర్వ ప్రాథమిక టీచర్ లుగా అంగన్వాడీలు

హైదరాబాద్ (జూలై – 09) : తెలంగాణ రాష్ట్రంలో అంగన్ వాడీలకు త్వరలో పూర్వ ప్రాథమిక టీచర్ స్థాయి వస్తుందని (anganwadis as pre primary teachers)రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.

శనివారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ క్లబ్ హౌస్ లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బీఆర్డీయూ) రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఏండ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీలకు నేడు సరైనగౌరవం దక్కిందని పేర్కొన్నారు.

రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఫైనాన్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినోద్కుమార్ కు అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు.