POWER GRID JOBS : 452 డిప్లొమా ట్రైనీలు

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 05) డిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ రీజియన్/ కార్పొరేట్ టెలికాం డిపార్ట్మెంట్ కార్యాలయాల్లో రీజినల్ రిక్రూట్మెంట్ స్కీం కింద డిప్లొమా ఇంజినీర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద
రూ.27,500 స్టైపెండ్ అందుతుంది. శిక్షణ అనంతరం జూనియర్ ఇంజినీర్ గ్రేడ్-4 హోదాలో నియమితులవుతారు.

పోస్టింగ్ రీజియన్ : నార్తర్న్, ఈస్టర్న్, నార్త్- ఈస్టర్న్, సదరన్, వెస్టర్న్, ఒడిషా ప్రాజెక్ట్స్, కార్పొరేట్ సెంటర్.

విభాగాలు : ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్,

అర్హతలు : కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్- పవర్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్).

వయోపరిమితి : 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : 300/-

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 23 – 2023 వరకు

రాత పరీక్ష తేదీ : అక్టోబర్-2023.

వెబ్సైట్: https://www.powergrid.in/