DIGENE ANTACIDE : డైజీన్ యంటాసిడ్ ఆమ్మకాల పై నిషేధం

న్యూఢిల్లీ (సెప్టెంబర్ 07) : DCGI BANS DIGENE GEL – కడుపులో మంట నివారణకు, ఆహారం అరుగుదలకు వినియోగించే అబాట్ ఇండియా కంపెనీకి చెందిన DIGENE GEL ANTACIDE ఔషధంపై డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అమ్మకాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఒకే బ్యాచ్ కు చెందిన రెండు డైజిన్ ఔషధాలు వేర్వేరుగా ఉన్నాయని ఒక వ్యక్తి డీసీజీఐకి ఫిర్యాదు చేశారు. ఒక బాటిల్ పుదీనా రుచితో తియ్యగాళఉండగా, మరొకటి చేదుగా, ఘాటైన వాసనతో ఉందంటూ పేర్కొన్నాడు. దీనిపై అప్రమత్తమైన డీసీజీఐ సంబంధిత కంపెనీకి లేఖ రాసింది.

ఆ కంపెనీ స్వచ్ఛందంగా వాటి అమ్మకాలను నిలిపివేసి తమ ఔషధాలను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. అబాట్ ఇండియా కంపెనీ గోవా యూనిట్ లో తయారైన యాంటాసిడ్ మందులను వాడవద్దని, డాక్టర్లు వాటిని సూచించవద్దని, మందుల షాపుల వారు వాటి అమ్మకాలను నిలిపివేయాలని డీసీజీఐ ఆదేశాలు జారీ చేసింది.