DAILY CURRENT AFFAIRS IN TELUGU 6th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 6th SEPTEMBER 2023

1) ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ 2023లో భారత జట్టుకు ఏ పథకం దక్కింది.?
జ : కాంస్య పథకం

2) అత్యధిక సార్లు పురుషుల గ్రాండ్ స్లామ్స్ సెమీస్ కు చేరిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు .?
జ : నోవాక్ జకోవిచ్ (47 సార్లు)

3) పిన్‌టెక్ ఆదాయం ఏ సంవత్సరం వరకు 200 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆర్బిఐ గవర్నర్ శక్తి కాంతా దాస్ అభిప్రాయపడ్డారు.?
జ : 2030

4) 2011 – 12 లో దేశ జీడీపీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) ఖర్చు 0.76 శాతం ఉండగా 2020 – 2021 నాటికి ఎంత శాతం గా ఉంది.?
జ : 0.64%

5) 43వ ఏసియన్ సదస్సు 2023 సెప్టెంబర్ 5 నుండి 7 వరకు ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : జాకర్తా (ఇండోనేషియా)

6) డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ ఔషధంపై ఇటీవల నిషేధం విధించింది.?
జ : డైజిన్

7) యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ నివేదిక ప్రకారం 199 – 2019 మధ్య క్యాన్సర్ కేసులు ఎంత శాతం పెరిగాయి.?
జ : 79%

8) ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ ఆహార పదార్థానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (GI TAG) దక్కింది.?
జ : ఆత్రేయపురం పూతరేకులు

9) ఢిల్లీలో జరిగే జీ ట్వంటీ సదస్సు శిఖరాగ్ర సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటరాజ విగ్రహ రూపశిల్పి ఎవరు.?
జ : రాధాకృష్ణన్

10) యూఎస్ ఓపెన్ 2023 లో సెమీఫైనల్ కు చేరిన అన్ సీడేడ్ ఆటగాడు ఎవరు?
జ : బెన్ షెల్డన్ (అమెరికా)

11) ఢిల్లీలో జరిగే జీ 20 శిఖరాగ్ర సదస్సుకు ఎన్ని దేశాలను అతిధి దేశాలుగా ఆహ్వానిస్తున్నారు.?
జ : 9

12) టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీ 2023 మహిళల విభాగంలో విజేత ఎవరు.?
జ : దివ్య దేశ్‌ముఖి

13) పౌర పెన్షన్ పంపిణీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుకు పర్మిషన్ ఇచ్చింది.?
జ : బంధన్ బ్యాంక్

14) FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న భారత్లోని రెండు నగరాలు ఏవి.?
జ : భువనేశ్వర్, గువహతి

15) భారతదేశం ఏ బ్యాంకు తో కలిసి లోడియ – ఢిల్లీ ప్రాంతంలో క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ హబ్ ను ఏర్పాటు చేయనుంది.?
జ : ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్

16) చంద్రయాన్ 3 మిషన్ లాంచ్ కు కౌంట్ డౌన్ చెప్పిన మహిళ శాస్త్రవేత్త ఇటీవల మరణించారు. ఆమె పేరు ఏమిటి.?
జ : యన్. వాలర్‌మతి