DAILY G.K. BITS IN TELUGU 22nd SEPTEMBER

DAILY G.K. BITS IN TELUGU 22nd SEPTEMBER

1) మండల పంచాయతీ అనే భావనను సిఫారసు చేసింది ఎవరు?
జ : అశోక్‌ మెహతా

2) జాతీయ మైనారిటీ కమిషన్‌ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు?
జ : 1982

3) లోక్‌సభను రద్దుచేసే అధికారం ఎవరికి ఉన్నది?
జ : రాష్ట్రపతి

4) భారత రాజ్యాంగంలో ‘హెబియస్‌ కార్పస్‌’ అనే రిట్‌ను జారీచేసే అధికారం ఎవరికి ఇచ్చారు?
జ : సుప్రీంకోర్టు, హైకోర్టు

5) లోకాయుక్తను తొలగించే అధికారం ఎవరికి ఉంది?
జ : రాష్ట్ర గవర్నర్‌

6) ఓటు హక్కు వినియోగించుకునే వయసును పార్లమెంటు 21 నుంచి 18 ఏళ్లకు ఏ సంవత్సరంలో తగ్గించింది?
జ : 1989

7) రాజ్యాంగంలోని 40వ ప్రకరణం దేనికి సంబంధించినది?
జ : గ్రామ పంచాయతీల ఏర్పాటు

8) రాజ్యాంగంలో ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రకారం పౌరులకు ఏ రకమైన స్వేచ్ఛను ఇచ్చారు?
జ : వాక్‌, భావ ప్రకటన స్వేచ్ఛ

9) అరెస్టు తర్వాత కోర్టులో హాజరు పరచాలని నిర్దేశించే హక్కు?
జ : ప్రాథమిక హక్కు

10) రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత, దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు?
జ : 1976

11) 2015వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి చేసిన 100వ సవరణ దేనికి సంబంధించినది?
జ : భారత్‌ -బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన సరిహద్దు ఒప్పందాలు

12) కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని ఎవరు నిర్ణయిస్తారు?
జ : రాష్ట్రపతి