DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th SEPTEMBER 2023

1) యువతలో డిజిటల్ స్కిల్స్ పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థతో 8 ఒప్పందాలు చేసుకుంది.?
జ : IBM

2) బ్రిటన్ లోని చర్చిల్ యొక్క ఓల్డ్ వార్ ఆఫీస్ ను లగ్జరీ హోటల్ గా మార్చిన సంస్థ ఏది.?
జ : హిందూజా గ్రూప్

3) ఇంటెల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గోకుల్ సుబ్రమణ్యం

4) వరల్డ్ లైవ్ రిపోర్ట్ ప్రకారం జూన్ 2023లో భారతదేశ వ్యాప్తంగా ఎంత మొత్తంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి.?
జ : 9.3 బిలియన్ డాలర్లు

5) యూపీఐ లావాదేవీలు అత్యధికంగా జరుపుతున్న మొదటి మూడు రాష్ట్రాలు ఏవి.?
జ : మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు

6) మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న లైట్ హౌస్ ఫెస్టివల్ కు ఏ రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది.?
జ : గోవా

7) కేంద్ర ప్రభుత్వం ఇటీవల 54వ టైగర్ రిజర్వు “వీరరంగ దుర్గావతి టైగర్ రిజర్వు”ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది.?
జ : మధ్యప్రదేశ్

8) అమెరికాలో నిర్మించిన ఏ దేవాలయం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయంగా రికార్డులకు ఎక్కింది.?
జ : స్వామి నారాయణ అక్షరధామ్ టెంపుల్

9) రిపబ్లిక్ ఆఫ్ కాంగో తదుపరి భారత అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మదన్ లాల్ రాజ్‌గర్

10) ఆస్ట్రేలియాలో తదుపరి భారత హై కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గోపాల్ బాల్గే

11) భారతదేశంలోని ఏ రాష్ట్రం ఫుడ్ బాల్ క్రీడ అభివృద్ధి కోసం స్పెయిన్ దేశపు లీ లాగా సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : పశ్చిమబెంగాల్

12) భారత దేశంలోనే 70 శాతం భూభాగంలో కరువు పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని ఏ సంస్థ తన నివేదికలో పేర్కొంది.?
జ : డౌన్ టు ఎర్త్

13) 8,000 మీటర్ల ఎత్తుకంటే ఎత్తైన పర్వతాలను 42 సార్లు అధిరోహించి రికార్డు సృష్టించిన నేపాల్ పర్వతారోహకుడు ఎవరు?
జ : కమీ రీటా సెర్పా

14) భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా పేరుగాంచిన ఏ వ్యవసాయ శాస్త్రవేత్త సెప్టెంబర్ 28న తుదిశ్వాస విడిచారు.?
జ : ఎమ్మెస్ స్వామినాథన్

15) హ్యారీ పోటర్ చిత్రాల సిరీస్ లో నటించిన మైఖేల్ గాంబన్ ఇటీవల మరణించారు. ఆయన హ్యారీపోటర్ చిత్రంలో ఏ పాత్ర ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.?
జ : ప్రొఫెసర్ ఆల్బస్ బ్లేడోర్

16) భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం 1901 తర్వాత ఆగస్టు మాసంలో అతి తక్కువ వర్షాలు నమోదు అయిన సంవత్సరం ఏది?
జ : 2023

17) ఇటీవల తైవాన్ దేశం తయారుచేసిన జలాంతర్గామి పేరు ఏమిటి?
జ : హైకూ