DEGREE ADMISSIONS : బిసి గురుకుల డిగ్రీ అడ్మిషన్లు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 29) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన 17 డిగ్రీ బిసి గురుకుల కళాశాలల్లో స్పాట్ అడ్మీషన్లు (bc degree gurukula spit admissions 2023) కొరకు విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ను సంప్రదించాలని బిసి గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు సూచించారు.

సాంప్రదాయ కోర్సులతో పాటు ఉపాధితో ముడిపడిన సరికొత్త కోర్సులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా 17 డిగ్రీ కళాశాలలను ప్రారంభించింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కొత్త కాలేజీలను ప్రారంభించడంతో ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమయ్యింది. ఇప్పటికే తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ కానందున అధికారులు స్పాట్ అడ్మీషన్లు కొనసాగిస్తున్నారు.

ఇంటర్ పూర్తి చేసిన బిసి విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు తగిన ధృవీకరణ పత్రాలతో నేరుగా ఆయా కళాశాలలకు వెళ్ళి అడ్మీషన్లు పొందవచ్చు. పోటీ లేనందు వల్ల ప్రవేశాలు సులభంగా లభించనున్నాయి. మూడేళ్ళ పాటు ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు పూర్తి ఉచితంగా చదువుకోవచ్చు. ఉచిత భోజన వసతితో పాటు నాణ్యమైన విద్యను గురుకులాల్లో అందిస్తున్న విషయం తెలిసిందే. కొత్త కాలేజీల్లో కొన్నింటిలో ప్రభుత్వం ఒకేషనల్ కోర్సులను ప్రవేశ పెట్టింది. డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెట్టడం ద్వారా గురుకుల విద్య అనంతరం విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది.

వికారాబాద్ డిగ్రీ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ కోర్సు బిఏ(హనర్స్),

సంగారెడ్డిలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు, మిగతా కాలేజీల్లో బిఎస్‌సి(ఎంపిసిఎస్), బిఎస్‌సి (బిజెడ్‌సి), బికాం, బిఎ కోర్సులు – ప్రవేశ పెట్టారు.

వికారాబాద్ లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫిల్మ్ అండ్ మీడియా, యానిమేషన్ అండ్ విఎఫ్‌ఎక్స్, ఫోటోగ్రఫి అండ్ డిజిటల్ ఇమేజింగ్ కోర్సులతో బిఎ(హనర్స్) కోర్సులు కలవు.

సంగారెడ్డి కాలేజీలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు కలదు.