DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th AUGUST 2023

1) బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 లో కాంస్య పథకం నెగ్గిన భారత షట్లర్ ఎవరు?
జ : హెచ్ ఎస్ ప్రణయ్

2) ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 2023లో 200 మీటర్ల పురుషుల పరుగు పందెంలో స్వర్ణం నెగ్గిన క్రీడాకారుడు ఎవరు.?
జ : నోవా లైల్స్ (19.52 Seconds) (అమెరికా)

3) ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 2023లో 200 మీటర్ల మహిళల పరుగు పందెంలో స్వర్ణం నెగ్గిన క్రీడాకారిణి ఎవరు.?
జ : షెరికా జాన్సన్ (జమైకా)

4) ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 2023లో 4×400 నీ తర్ల రిలే పరుగు పందెంలో ఫైనల్ కు చేరిన భారత జట్టు ఏది.?
జ : ఆనస్, జాకబ్, వరియాత్తోడి, రాజేష్ రమేష్

5) భారత ఇస్రో సూర్యుని అధ్యయనం కోసం ఆదిత్య యల్1 ప్రయోగాన్ని ఏరోజు చేపట్టనుంది.?
జ : సెప్టెంబర్ – 2 – 2023

6) చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన నినాదం ఏమిటి?
జ : జై విజ్ఞాన్ – జై అనుసంధాన్

7) మైనర్ ఇరిగేషన్ అభివృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలో ఎన్నో స్థానాల్లో నిలిచాయి.?
జ : 5, 9.

8) ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్రం ఎంత శాతం పన్ను విధించింది.?
జ : 20%

9) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ఏ దేశాలకు చెందిన వ్యోమగాములను నాసా పంపింది.?
జ : అమెరికా, రష్యా, డెన్మార్క్, జపాన్

10) గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా భారత్ ఎవరిని అంతరిక్షంలోకి పంపనుంది.?
జ : ఆడ రోబో

11) ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (IBSA) నిర్వహించిన వరల్డ్ గేమ్స్ లో క్రికెట్ లో స్వర్ణం సాధించిన జట్టు ఏది.?
జ : భారత్ (ఆస్ట్రేలియా పై)

12) ప్రస్తుత SBI చైర్మన్ ఎవరు.?
జ : దినేష్ ఖరా