DAILY CURRENT AFFAIRS IN TELUGU 15th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 15th SEPTEMBER 2023

1) SAFF – U16 ఛాంపియన్షిప్ 2023 గెలుచుకున్న దేశం ఏది.?
జ : భారత్

2) భారత నావికాదళం ఏ సంస్థతో ప్రైవేట్ ప్రయాణాల కోసం ఒప్పందం చేసుకుంది.?
జ : ఉబేర్

3) జి20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేయదలచుకున్న ఎకనామిక్ కారిడార్ “ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్” కారిడార్ లో ఏ దేశానికి స్థానం లేదు.?
జ : రష్యా

4) ఆర్చరీ వరల్డ్ కప్ 2023 ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : మెక్సికో

5) 2023 సంవత్సరానికి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్ ఎవరు.?
జ : శుభమన్ గిల్

6) టైమ్స్ మ్యాగజై న్ టాప్ 100 అత్యుత్తమ కంపెనీల జాబితా 2023లో చోటు సంపాదించుకున్న భారత కంపెనీ ఏది.?
జ : ఇన్ఫోసిస్

7) టైమ్స్ మ్యాగజై న్ టాప్ 100 అత్యుత్తమ కంపెనీల జాబితా 2023లో మొదటి రెండు కంపెనీలు ఏవి.?
జ : గూగుల్, మెటా

8) మార్నింగ్ కన్సల్ట్ నివేదిక ప్రకారం అత్యంత ఆమోదయోగ్యతగల ప్రధానమంత్రి ఎవరు.?
జ : నరేంద్ర మోడీ

9) రష్యా కు చెందిన ప్రైవేట్ సైన్యం వార్నర్ గ్రూపును ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన దేశం .?
జ : బ్రిటన్

10) దేశ రక్షణ అవసరాల కోసం యుద్ధ విమానాలు, రక్షణ పరికరాలు కొనుగోలు కు ఎన్ని వేల కోట్లకు ఇటీవల అమోదం లభించింది.?
జ : 45 వేల కోట్లు

11) ఐజి నోబెల్ బహుమతి 2023 పొందిన భారతీయుడు ఎవరు.?
జ : అనూప్ రాజప్పన్

12) సంగీత నాటక అకాడమీ అవార్డులు 2023 ను ఎంతమందికి ప్రకటించారు.?
జ : 84 మందికి

13) 2023 సంవత్సరంలో అందించే నోబెల్ బహుమతి నగదు బహుమతిని ఎంతకు పెంచారు.?
జ : 1.1 కోటి క్రొనార్స్ (8.19 కోట్లు)

14) అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న (113) లూయిస్ రికార్డును ఇటీవల ఎవరు సమన్ చేశారు.?
జ : ఆడమ్ జంపా

15) రాజ్యాంగ పీఠికను పాఠశాల ప్రార్థన సమయంలో కచ్చితంగా చదవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : కర్ణాటక

16) యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తలు భూమి మీద ఉన్న ఎలక్ట్రాన్ల కారణంగానే చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని ఇస్రో ప్రయోగించిన ఏ మిషన్ ఆధారంగా ఇటీవల ప్రకటన విడుదల చేశారు.?
జ : చంద్రయాన్ 1

17) ఎన్ పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాహుల్ నవీన్

18) అంతర్జాతీయ వన్డేలలో 2500 పరుగులు, 200 వికెట్లు తీసిన రెండ భారత క్రికెటర్ గా ఎవరు కపిల్ దేవ్ సరసన నిలిచారు.?
జ : రవీంద్ర జడేజా

19) భారత తరఫున అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో 200 వికెట్లు తీసిన ఏడవ బౌలర్ గా ఎవరు నిలిచారు.?
జ : రవీంద్ర జడేజా

20) పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 16న ఎక్కడ ప్రారంభించనున్నారు.?
జ : నార్లాపూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా)