DAILY CURRENT AFFAIRS IN TELUGU 14th JULY 2023

1) అత్యధిక శాఖాహారులు ఉన్న దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : భారతదేశం

2) ఏనుగులకు మానవులకు మధ్య ఘర్షణ తగ్గించడానికి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : గజాకోత

3) సీనియర్ సిటిజన్స్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన పథకం పేరు ఏమిటి.?
జ : అటల్ వయో అభ్యుదయ యోజన (AVAY)

4) మానవ సంబంధాలు మరియు సెక్స్ ఎడ్యుకేషన్ ను తప్పనిసరి చేస్తూ ఏ దేశం నిర్ణయం తీసుకుంది.?
జ : ఐర్లాండ్

5) ఫ్రాన్స్ దేశపు అత్యున్నత సైనిక గౌరవ పురస్కారమైన ఏ పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ ప్రభుత్వం అందజేసింది.?
జ : గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ హనర్

6) భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని ఏ దేశ సెనేట్ తీర్మానం చేసింది.?
జ : అమెరికా సెనేట్

7) జూన్ 2023 మాసానికి గాను దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : మైనస్ 4.12

8) గత 174 సంవత్సరాల జూన్ మాసాలలో నమోదు అయిన ఉష్ణోగ్రతల లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఏ సంవత్సరం జూన్ లో నమోదు అయ్యాయి.?
జ : 2023 – జూన్

9) వాతావరణం రికార్డులు మొదలైనప్పటి నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 10 సంవత్సరాలలో ఇటీవల ఏ సంవత్సరం కూడా చోటు సంపాదించుకుంది.?
జ : 2023

10) వెన్నెముకతో తల విడివడిన బాలుడిని తిరిగి వెన్నెముక – తలను ఏ దేశ శాస్త్రవేత్తలు విజయవంతంగా అతికించారు.?
జ : ఇజ్రాయోల్

11) జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (జక్సా) ప్రయోగించిన ఏ రాకెట్ విఫలమైంది.?
జ : ఎఫ్సీలాన్ – ఎస్

12) ఫ్రాన్స్ దేశంలో ఏ నగరంలో భారత్ మరొక దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించనుంది.?
జ : మార్సెల్లి

13) పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక సార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరిన (35) ఆటగాడిగా జకోవిచ్ ఎవరి రికార్డును బ్రేక్ చేశాడు.?
జ : క్రిస్ ఎవర్ట్ (34)

14) వింబుల్డన్ 2023 ఫైనల్ కు చేరిన మహిళల సింగిల్స్ క్రీడాకారులు ఎవరు.?
జ : జాబేర్ & వొండ్రుసోవా

15) కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2023 లో స్వర్ణం నెగ్గిన భారత లిఫ్టర్ ఎవరు.?
జ : అజిత్

16) ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2023లో బంగారు పథకాలు గెలుచుకున్న భారత క్రీడాకారులు ఎవరు.?
జ : రాజేందర్ పాల్ (షాట్ పుట్), తారుల్ సింగ్ (3000 మీ స్టిపుల్ చేజ్)