DAILY CURRENT AFFAIRS IN TELUGU 13th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 13th JUNE 2023

1) ‘ఫోర్బ్స్ గ్లోబల్ 2000’ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన కంపెనీ ఏది.?
జ : జేపీ మోర్గాన్ బ్యాంకు (ఆరామ్ కో 2వ స్థానం)

2) ‘ఫోర్బ్స్ గ్లోబల్ 2000’ జాబితాలో భారత్ నుండి మొదటి స్థానంలో నిలిచిన కంపెనీ ఏది.?
జ : రిలయన్స్ (ప్రపంచంలో 45వ స్థానం)

3) స్టాక్ మార్కెట్ లో ఏ కంపెనీ షేర్ విలువ లక్ష రూపాయలు మార్కును తాకింది.?
జ : MRF

4) డ్రైవర్ అవసరంలేని ‘జీప్యాడ్’ అనే ఆహనాన్ని తయారుచేసిన బెంగళూరుకు చెందిన స్టార్ట్అప్ సంస్థ ఏది.?
జ : మైనస్ జీరో

5) ఆసియా అండర్ 17 మహిళల రెజ్లింగ్ విజేతగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్

6) ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన లింగ సామాజిక సూచి – 2023 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం మహిళలు దేశ అధ్యక్ష స్థాయి పదవులలో ఉన్నారు.?
జ : కేవలం 10 శాతం

7) భారత్ – మాల్దీవ్ దేశాల మధ్య 11వ మిలటరీ విన్యాసాలు ఉత్తరాఖండ్ లో ఏ పేరుతో ప్రారంభమయ్యాయి.?
జ : ఎక్స్ ఎకువేరియన్

8) ఏ రాష్ట్రంలో హార్టికల్చర్ అభివృద్ధి కోసం భారతదేశం ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుతో 130 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది.?
జ : హిమాచల్ ప్రదేశ్

9) సబిర్టన్ టెన్నిస్ ట్రోఫీ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : అండీ ముర్రే

10) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత దేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన దేశాల జాబితాలో యూఏఈ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : నాలుగవ

11) 2023 జూన్ 1 నాటికి భారతదేశం ఎన్ని దేశాలతో రూపాయిలలో విదేశీ వాణిజ్యం ప్రారంభించింది.?
జ : 18 దేశాలతో

12) ఇటీవల అమెరికా – ఫిలిపిన్స్ దేశాల మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసాల పేరు ఏమిటి?
జ : బలి కాటన్