ENGvsNZ న్యూజిలాండ్ ఘన విజయం

అహ్మదాబాద్ (అక్టోబర్ – 05) : CWC 2023 అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ 2023 లో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ (ENGvsNZ) జట్ల మధ్య జరిగిన . న్యూజిలాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులో జో రూట్ (77) , జోస్ బట్లర్ (43),.బెయిర్‌స్టో 33 పరుగులతో రాణించడంతో 50 ఓవర్లలో 282/9 పరుగులు సాదించింది. ఇంగ్లండ్ బౌలర్లలో హెన్రీ 3, శాంటర్న్ మరియు ఫిలిఫ్ రెండేసి వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు కేవలం ఒక వికెట్ నష్టపోయి సునాయాసంగా విజయం సాదించింది. కాన్వే (152*) వీరవిహరం చేయగా… జతకలిసిన యువ ఆటగాడు రుచిర రవీంద్ర (123*) చెలరేగడంతో ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో 36.2 ఓవర్లలోనే 282 పరుగుల లక్ష్యం చేదించి సంచలన విజయం తో శుభారంభం చేసింది.

ఈ మ్యాచ్ రుచిర రవీంద్ర ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తరపున సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడిగా మరియు అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల సృష్టించాడు.

జో రూట్ ఈ ప్రపంచ కప్ లో తొలి అర్ద సెంచరీ నమోదు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో తొలి బౌండరీ బెయిర్‌స్టో కొట్టగా, తొలి వికెట్ ను మాట్ హెన్రీ… డెవిడ్ మాలన్ వికెట్ రూపంలో తీశాడు.