ISRO JOBS : బీటెక్ తో 435 ఖాళీల భర్తీ

హైదరాబాద్ (అక్టోబర్ – 05) : తిరువనంతపురంలోని ఇస్రో ఆధ్వర్యంలో పనిచేస్తున్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 435 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు 273 కాగా, టెక్నికల్ అప్రెంటిస్ ఖాళీలు 167 గా ఉన్నాయి.

విభాగాలు : ఏరోనాటికల్/ ఏరోస్పేస్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, ప్రొడక్షన్, ఫైర్ & సేఫ్టీ, హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ తదితరాలు.

అర్హతలు :

  1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్ లో
    కనీసం 60 శాతం మార్కులతో బీటెక్/ బీఈ/ బీఎస్సీ/ బీకామ్/ బీఏ/ బాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణత.

వయోపరిమితి : 28 ఏళ్లు ఉండాలి.

అప్రెంటిస్ శిక్షణ వ్యవధి: 12 నెలలు.

స్టైపెండ్ : 9000/- నెలకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్ మార్కుల ఆధారంగాళఎంపిక ఉంటుంది.

  1. టెక్నీషియన్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్ లో
    ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

అప్రెంటిస్ శిక్షణ వ్యవధి: 12 నెలలు.

స్టైపెండ్: 8000/- నెలకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, పరీక్షలో మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, కమలసెరి,
ఎర్నాకుళం జిల్లా, కేరళ.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

ఇంటర్వ్యూ తేదీ: 07.10.2023: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు.

వెబ్సైట్ : https://www.vssc.gov.in/