CURRENT AFFAIRS IN TELUGU 11th APRIL 2023
1) ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్స్ షిప్ లో రజత పథకం సాదించిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : నిషా దహియా
2) IMF 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ది రేటును గతంలో 6.1% గా అంచనా వేయగా ప్రస్తుతం ఎంతగా అంచనా వేసింది.?
జ : 5.9%
3) ఎప్రిల్ 21 నుంచి అంతర్జాతీయ రైస్ బ్రాన్ ఆయిల్ సదస్సు ఎక్కడ జరగనుంది.?
జ : హైదరాబాద్
4) దేశంలో తొలి 3D పోస్ట్ ఆపీస్ ను ఎక్కడ నిర్మిస్తున్నారు.?
జ : అల్సూర్ బజార్ (బెంగళూరు)
5) దేశంలో అత్యంత శుద్దమైన తాగునీరు అందిస్తున్న రాష్ట్రలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ
6) ఏ దేశం తమ రాజ్యాంగ సంస్కరణలు కోసం చేపడుతున్న రెఫరెండం కోసం భారత ఎన్నికల సంఘాన్ని పరిశీలకులు గా రమ్మని ఆహ్వానించింది.?
జ : ఉజ్బెకిస్తాన్
7) ఏ రాష్ట్ర ప్రభుత్వం సావర్కర్ జయంతి (మే – 28) ని “స్వతంత్ర వీర్ గౌరవ్ దినోత్సవం” గా జరపాలని నిర్ణయం తీసుకుంది.?
జ : మహారాష్ట్ర
8) ప్రధాని నరేంద్రమోడీ రాజస్తాన్ లో వందే భారత్ రైల్ ను ప్రారంభించారు. ఇది ఏయో స్టేషన్ ల మద్య ప్రయాణించనుంది.?
జ : అజ్మీర్ – న్యూడిల్లీ
9) టచ్ లెస్ బయోమెట్రిక్ సిస్టం అభివృద్ధి కోసం UIDAI ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : IIT – ముంబై
10) స్టేట్ ఎనర్జీ ఎఫిసియన్సీ ఇండెక్స్ – 2021- 22 లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్, (తెలంగాణ – 5వ స్థానం)
11) భారత్ లో మొదటి స్థానిక సెమీ హైస్పీడ్ రైల్ ను డిల్లీ – మీరట్ ల మద్య NCRTC ప్రారంభించింది. దాని పేరు ఏమిటి.?
జ : RAPIDX
12) డిల్లీ తర్వాత మెట్రో నెట్వర్క్ అత్యధిక దూరం గల రెండో నగరంగా ఏ నగరం నిలిచింది.?
జ : బెంగళూర్ (హైదరాబాద్ – 03)