విద్యా హక్కు ప్రదాత అంబేద్కర్‌ – అస్నాల శ్రీనివాస్

  • ఎప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం

BIKKI NEWS ఆధునిక భారత చరిత్ర యవనిక పై దేశం ఎదుర్కొన్న రాజకీయ, సాంఘీక, ఆర్థిక విప్లవాలలో చింతనాపరుడిగా, నిర్మాతగా మహత్తరమైన చారిత్రక బాధ్యతలను నిర్వర్తించిన సమగ్ర సామాజిక విప్లవకారుడు డా||బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, ఆర్థికవేత్తగా, రాజనీతి కోవిదుడిగా, న్యాయశాస్త్ర పారంగతుడుగా, బహుజనుల ఆశాజ్యోతిగా, చైతన్యకేతనమై నిలిచాడు. స్వేచ్ఛ, స్వౌతంత్య్రం, సౌభ్రాృతృత్వంల మేలు కలయికగా ఉండే సమాజస్థాపన కోసము ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత కఠినమైన, మేధో, శారీరక శ్రమ చేసిన ఆచరణశీలి. జాతీయోద్యమములో పాల్గొంటూ ఈస్టిండియా కంపెని, బ్రిటీష్‌ సామ్రాజవాదం ఈ దేశ వనరులను, శ్రమశక్తిని కొల్లగొట్టిన వైనాన్ని, ప్రజల బాగోగుల పట్ల ప్రదర్శించిన తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎండగట్టాడు. ఇదే సమయంలో ప్రతి మనిషికి ఒకే విలువను, సామాజిక ప్రజాస్వామ్యంను అడ్డుకుని, వాటికి తాత్విక సమర్ధన చేస్తున్న శృతి, స్మ ృతి, పురాణాది, ప్రాచీన వాజ్మయాన్ని బట్టబయలు చేసి సంస్కరణోద్యమాన్ని, పీడిత జనోద్దరణను శక్తివంతంగా నడిపించాడు.

ఆధునిక భారత చరిత్ర యవనిక పై దేశం ఎదుర్కొన్న రాజకీయ, సాంఘీక, ఆర్థిక విప్లవాలలో చింతనాపరుడిగా, నిర్మాతగా మహత్తరమైన చారిత్రక బాధ్యతలను నిర్వర్తించిన సమగ్ర సామాజిక విప్లవకారుడు డా||బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ – అస్నాల శ్రీనివాస్

నవంబర్‌ 25, 1949 రాజ్యాంగ సభలో మాట్లాడుతూ మన సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి వీలైనంత త్వరగా రాజ్యంగబద్ధమైన పద్ధతులను అవలంభించాలి. శాసనోల్లంఘన, సహాయనిరాకణ పద్ధతులను తప్పనిసరిగా విడనాడాలి. ఒకవేళ లక్ష్యాల సాధనకు రాజ్యంగ మార్గము ఉపయోగపడనప్పుడు రాజ్యాంగ విరుద్దమైన పద్ధతులను అవలంభించాలి అని చెపుతూ తన జీవితకాలంలో ఆచరించాడు. మైనారిటిపై మెజారిటి ఆధిపత్యము తగ్గించడం కోసము, అణగారిన వర్గాలు, మైనారిటీలు ఆధిపత్య సమూహాలతో సమానంగా అభివృద్ధి చెందడం కోసము, వివిధ ప్రాంతాల ప్రత్యేక అవసరాలను తీర్చటం కోసం, సమర్ధవంతమైన పాలనను ఏర్పాటు చేయడానికి చిన్న రాష్ట్రాలు ఉపకరిస్తాయనే తాత్వికతో రాజ్యంగంలో ‘3’ వ ప్రకరణను ఏర్పాటు చేసాడు. అంబేద్కర్‌ సూచించిన పోరాట మార్గంలో అరవై సంవత్సరాల జయపజయాలతో సంబంధం లేకుండా జరిగిన పోరాట క్రమంలో అంతిమ విజయాన్ని సాధించి తెలంగాణ తన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకుంది.

స్వేచ్ఛ, స్వౌతంత్య్రం, సౌభ్రాృతృత్వంల మేలు కలయికగా ఉండే సమాజస్థాపన కోసము ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత కఠినమైన, మేధో, శారీరక శ్రమ చేసిన ఆచరణశీలి.అస్నాల శ్రీనివాస్

ప్రాచీన భారతీయ వాణిజ్యం, భారత కరెన్సీ, రూపాయి సమస్య, బ్యాకింగ్‌, బ్రిటిష్‌ ఇండియా ఆర్థిక వ్యవస్థ, కులాలు, అస్పృశ్యులు, శూద్రుల పుట్టుక మొదలగు సామాజిక ఆర్థిక అంశాలపై అసమాన అధ్యయనం చేసి అపారమైన సమాచారాలను గ్రంథస్తం చేసిన అంబేద్కర విద్యావేత్తగా కూడా సామాజిక విద్యా స్థాపన కోసం కృషి చేసాడు. అమెరికా విద్యావేత్త ఉదారవాది జాన్‌ డ్యూయి తాత్విక ధక్ఫథంతో ప్రభావితుడయ్యాడు. సామాజిక మార్పు పోరాటాల ద్వారా, పోరాటాల విజ్ఞానం ద్వారా, విజ్ఞానము విద్య ద్వారా లభిస్తుందని, విద్య విముక్తికి సాధనంగా పని చేస్తుందని నమ్మాడు. విద్యా వివేకాలు సమాజంలో సాంప్రదాయ విలువలను వేగంగా తుడిచిపెట్టి సామాజిక మార్పును ప్రేరేపిస్తాయని, చదువుకుంటే బతకగలము, భవిష్యత్‌ను జయించగలము. సమాజాన్ని ఒక తోపు తోయగలము” అనే తాత్విక వెలుగులో విద్యావ్యాప్తికి కృషి చేసాడు.

వివిధ ప్రాంతాల ప్రత్యేక అవసరాలను తీర్చటం కోసం, సమర్ధవంతమైన పాలనను ఏర్పాటు చేయడానికి చిన్న రాష్ట్రాలు ఉపకరిస్తాయనే తాత్వికతో రాజ్యంగంలో ‘3’ వ ప్రకరణను ఏర్పాటు చేసాడు. అస్నాల శ్రీనివాస్

1927 లో బొంబాయి శాసన మండలిలో అణగారిన వర్గాల ప్రతినిధిగా నియమితుడైన అంబేద్కర్‌ భారతదేశ విద్యారంగ పరిణామాన్ని, ఆంగ్లేయుల భాధ్యత రాహిత్యాన్ని తెలియజేసారు. ప్రభుత్వ రాబడులలో ఎనభై శాతాన్ని పోలీసు, మిలటరి రంగాలకు కేటాయించడం సబబుకాదని, విద్యా రంగానికి గణనీయంగా నిధులను కేటాయించాలని కోరారు. 1813 చార్టర్‌ చట్టం, 1854 వుడ్స్‌ ప్రతిపాదనలు, 1882 హంటర్‌ కమీషన్‌, 1913 కలకత్తాలో బ్రిటన్‌ రాజు జార్ట్‌-5 విద్యావ్యాప్తి నా హృదయానికి దగ్గరైన విషయం, వ్యవసాయ, పరిశ్రమలు అభివృద్ధి చెందటానికి పౌరులు అనేక రంగాలలో ఉన్నతంగా ఎదగటానికి దేశమంత విద్యా సంస్థలను విస్తరింపజేయాలి” అని చేసిన ప్రకటనతో బ్రిటిష్‌ వారు అక్కడక్కడ బడులను ప్రారంభించారు. ‘అన్ని కులాలకు ప్రవేశం అని చెప్పిన ఆధిపత్య వర్గాలకు మినహా గిరిజనులు, దళితులు, శూద్రకూలాలకు ప్రవేశం కల్పించలేదు. ఆచరణలో వారిపై నిషేధం కొనసాగింది. 1856 లో ఒక మహార్‌ విద్యార్థి తన ప్రవేశాన్ని నిరాకరిస్తున్నారని ఫిర్యాదు చేసినప్పుడు” ఆధిపత్య వర్గాల విద్యార్థులు మాత్రమే హాజరవుతున్న పాఠశాలలో అతనికి ప్రవేశం కల్పించి తద్వారా పాఠశాల జనబాహుళ్యానికి ఉపయోగపడకుండా ఉండే ప్రమాదం కన్న అతనికి ప్రవేశం కల్పించకపోవడమే సరైనదని తేల్చి చెప్పింది.

ప్రభుత్వ రాబడులలో ఎనభై శాతాన్ని పోలీసు, మిలటరి రంగాలకు కేటాయించడం సబబుకాదని, విద్యా రంగానికి గణనీయంగా నిధులను కేటాయించాలని కోరారు అంబేద్కర్ – అస్నాల శ్రీనివాస్

ఇండియాలో బొంబాయి గవర్నర్‌గా పని చేసిన విశాల హృదయుడు, చరిత్రకారుడు స్టువర్ట్‌ ఎల్ఫిన్‌స్టోన్‌ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని నిమ్మ వర్గాలకు వీధి బడులను ప్రారంభించాడు. కొన్ని ప్రాంతాలకు మిషనరీ సంస్థలకు సహకారం అందించాడు. 1923 బొంబాయి ప్రెసిడెన్సిలో ఎస్‌.కె.భోలే అధ్యర్యంలో శాసనమండలి ప్రజా ప్రభుత్వ విద్య సంస్థలలో అందరికి ప్రవేశం అని తీర్మానం చేసింది. కేవలం బ్రాహ్మణులు, ఎగువ మధ్యతరగతి ఉన్నత వర్గాల ప్రజలకు మాత్రమే విద్యకు నోచుకున్నారు. దళితులు, శూద్రుల నుండి ఎవ్వరూ కూడ నమోదు కాలేదు అని అంబేద్కర్‌ గణాంకాలతో వివరించాడు. ప్రాథమిక విద్యకు అధిక నిధులు కేటాయించాలని విద్యను వ్యాపారం చేయ్యకూడదని, అన్ని స్థాయిలో విద్యను వీలైనంత ఉచితంగా అందచేయాలని, ఉపకారవేతనాల బదులు వసతి గృహాలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

”మనం నాగరికత అందించిన భౌతిక ప్రయోజనాలనైనా వదులకోవచ్చునేమోగాని విద్య ద్వారా లభించే సర్వోత్కృష్ట ఫలితాలను, ఫలాలలను సంపూర్ణంగా అనుభవించే హక్కును మాత్రం ఎట్టి పరిస్థితులలో కొల్పోకూడదు” – అస్నాల శ్రీనివాస్

”మనం నాగరికత అందించిన భౌతిక ప్రయోజనాలనైనా వదులకోవచ్చునేమోగాని విద్య ద్వారా లభించే సర్వోత్కృష్ట ఫలితాలను, ఫలాలలను సంపూర్ణంగా అనుభవించే హక్కును మాత్రం ఎట్టి పరిస్థితులలో కొల్పోకూడదు” అని విద్య ప్రాధాన్యతను చెపుతూ, ప్రజ్ఞ, కరుణ, సమత వంటి విలువల సాధనే విద్యా పరమార్థము అని నమ్ముతూ, తన విద్యార్జనకు ఎదురైన అనుభవాలతో స్వతంత్రంగా విద్యావ్యాప్తికి కృషి చేసాడు. 1935 లో బెల్గాం, పోలాపూర్‌లలో గురుకుల పాఠశాలలను 1945 లో పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సోసైటిని ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మక సిద్ధార్థ, మిళింద్‌లతో పాటు యాభై కళశాలలను, వృత్తి శిక్షణా కేంద్రాలను, రాత్రి బడులను ప్రారంభించాడు. అవకాశాలు లభిస్తే అణగారిన వర్గాలు ఎంత ఉన్నతంగా ఎదగవచ్చు అని తన విద్యా సంస్థల ద్వారా నిరూపించాడు. 1937 లో ”ఇండియన్‌ లేబర్‌ పార్టీ”ని స్థాపించి సార్వత్రిక నిర్భంధ ప్రాథమిక విద్యను అమలు కోసము ఉద్యమ స్పృహతో ప్రచారం చేసాడు. 1952 డిసెంబర్‌లో ఎల్పిన్‌స్టన్‌ కళాశాలలో ఇచ్చిన ఉపన్యాసంలో ఆధునిక ప్రపంచ అవసరాలను తీర్చే శాస్త్రీయ వైఖరులను కల్గించే జ్ఞానకేంద్రాలుగా విలసిల్లే విశ్వవిద్యాలయాల విద్యను ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాకుండా పాలకులు జాగ్రత్త వహించాలని కోరారు. స్త్రీలు సాధించిన ప్రగతి సమాజ ప్రగతికి కొలమానం అని చెపుతూ స్త్రీ విద్య వికాసం కోసము ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

1937 లో ”ఇండియన్‌ లేబర్‌ పార్టీ”ని స్థాపించి సార్వత్రిక నిర్భంధ ప్రాథమిక విద్యను అమలు కోసము ఉద్యమ స్పృహతో ప్రచారం చేసాడు అంబెడ్కర్ – అస్నాల శ్రీనివాస్

1918 లో సిడ్నిహం కళాశాలలో రాజకీయ అర్థశాస్త్ర ఆచార్యుడిగా, 1935 లో బొంబాయి న్యాయకళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అంబేద్కర్‌ ఉపాధ్యాయ వృత్తిపై విలువైన సూచనలు చేసారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ఉన్నతులని, వారు దేశానికి రథసారధులని, మన దేశం నంబర్ వన్ దేశం కావాలంటే మనకు నంబర్ వన్ టీచర్లను కల్గి ఉండాలని కాంక్షించారు పాలించే వర్గం కానప్పటికి ఉపాధ్యాయులు సమాజంలో ప్రభావశీలురుగా ఉంటారని, భవిష్యత్‌ను చూడగలుతుతారని, నాయకత్వం వహిస్తారని, సామాన్యమైన ప్రజలు వారిని అనుకరిస్తారని ఆవిధంగా పని చేయాలని ఉద్భోధించాడు. టీచర్లు చక్కని పండితులై ఉంటే సరిపోదు, చక్కని స్వర విన్యాసంతో బోధించాలి. నిరంతరం జ్ఞానాన్ని ఆర్జిస్తూ, సత్యాన్ని శోధిస్తూ దానిని ఆచరించడానికి ప్రయత్నం చెయ్యాలి. బోధనా స్వేచ్ఛతో పాటు పాఠ్యంశాల రూపకల్పనలో టీచర్లను భాగస్వామ్యం చెయ్యాలని సూచించాడు.

విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ఉన్నతులని, వారు దేశానికి రథసారధులని, మన దేశం నంబర్ వన్ దేశం కావాలంటే మనకు నంబర్ వన్ టీచర్లను కల్గి ఉండాలని కాంక్షించారు అంబేద్కర్ – అస్నాల శ్రీనివాస్

1951 జలంధర్‌ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ విద్యార్థులు మేధో సమాజంలో భాగస్వాములని దేశ భవిష్యత్‌ నిర్మాతలని, వారిలో వ్యక్తిత్వ నిర్మాణము. హేతుబద్దత, ఆధునికత, స్వయం అభ్యసన, జిజ్ఞాస, గ్రంధాలయాల సందర్శన, పఠనాసక్తి మొదలైన వైఖరులను కల్గించాలని అధ్యాపకులకు విజ్ఞప్తి చేసారు. ”విద్యావంతులు ఉద్యోగులు తాము ఎదగడానికి కష్టజీవులు సమర్పిస్తున్న మూల్యాన్ని గుర్తు చేసుకొని ఆయా వర్గాల ప్రజల పట్ల సానుభూతిని కల్గి ఉండి, వారికి తమ సమయాన్ని జ్ఞానాన్ని, సంపాదనలో కొంత మొత్తాన్ని కేటాయించి తిరిగి సమాజానికి చెల్లించు” అనే దానిని ఆచరణలో చూపించాలని అది గొప్ప మానవ విలువ అని సూచించాడు అలా చేయకపోతే ఆ సమాజం శిథిలమవుతుంది అని హెచ్చరించాడు. విద్యలేకపోవడం వల్లనే బహుజనులో ప్రగతి ఆగిపోయిందని, బానిసలుగా దారుణమైన వివక్షతకు గురయ్యారని తెల్సుకున్న అంబేద్కర్‌ ప్రభుత్వ విద్యా ప్రజల హక్కు కోసం పోరాడిన పూలే దంపతులు, గోవింద రనడే, గోపాలకృష్ణ గోఖలేల ఆశయాల స్ఫూర్తితో రాజ్యంగంలో 15(2), 15(4), 16(1) , 16(4), 21 25, 46 ప్రకరణలతో విద్యా సంబంధ రక్షణలను కల్పించాడు.

అంబేద్కర్‌ ప్రభుత్వ విద్యా ప్రజల హక్కు కోసం పోరాడిన పూలే దంపతులు, గోవింద రనడే, గోపాలకృష్ణ గోఖలేల ఆశయాల స్ఫూర్తితో రాజ్యంగంలో 15(2), 15(4), 16(1) , 16(4), 21 25, 46 ప్రకరణలతో విద్యా సంబంధ రక్షణలను కల్పించాడు. – అస్నాల శ్రీనివాస్

స్వాతంత్య్రం తర్వాత నెహ్రు, ఇందిరల కాలంలో వెలుగు వెలిగిన ప్రజా విద్యా వ్యవస్థ గత ముప్పై సంవత్సరాల నుండి నిర్వీర్యం అవుతున్నది. నరేంద్ర మోడి హయాంలో ఈ ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తి కాబడుతున్నది. జ.డి.పి.లో ఆరు శాతం కేటాయించాల్సింది ఉండగా 2023-24 లో 0.49% కేటాయించి మృత్యు ఘంటికలనుమోగించాడు. దేశవ్యాప్తంగా 70 ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్గిస్తూ తమ నిర్వహణ నిధులను తామే సమకూర్చుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసాడు. ప్రవేశ రుసుములు, హస్టల్‌ ఫీజులు పెంచడం ద్వారా మరల బహుజనులు ఉన్నత విద్యను అందుకోలేని స్థితి ఏర్పడుతున్నది. రాష్ట్రాలు నిర్వహించే విద్యా సంస్థలకు అరకొర నిధులను ఇస్తున్నాడు. వ్యాపార విద్యా సంస్థలు పుట్టగొడులుగా వెలుస్తున్నాయి. ప్రామాణిక ఆధారాలతో, సాక్ష్యాలతో శాస్త్రీయ వైఖరులను కల్పించే చరిత్ర, సైన్స్‌ పాఠ్యాంశాలను మారుస్తూ పునరుద్దరణ వాదంతో భిన్నత్వంలో ఏకత్వం, బహుళత్వ భారతీయ వారసత్వానికి విఘాతం కలిగించే పనులకు తెగబడుతున్నారు. విద్యాపరమైన అసమానతలతో సమాజం రెండు వర్గాలుగా చీలి దేశం అంతర్యుద్దం వైపు నెట్టివేయబడుతున్నది.

కేంద్రం దేశ జీ.డి.పి.లో ఆరు శాతం విద్యకు కేటాయించాల్సింది ఉండగా 2023-24 లో 0.49% కేటాయించి విద్య కు మృత్యు ఘంటికలను నరేంద్ర మోదీ మోగించాడు. అస్నాల శ్రీనివాస్

భూగర్భం నుండి ఎగసి భూమినే అంటిపెట్టుకొని అధ్యయనం నుంచి పోరాటం, పోరాటం నుంచి అధ్యయంతో ఏటికి ఎదురీదుతూ ప్రజల మనిషిగా, భారతదేశ ముద్దుబిడ్డలతో అగ్రగణ్యుడిగా వారి ఆకాంక్షలకు ప్రతీకగా నిలబడి పరిస్థితులలో, అవసరాలలో, అవకాశాలలో, ఎంపికలో సమతాదారులు వేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన అంబేద్కర్‌ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజాతంత్ర విద్యా విప్లవాన్ని పరిపూర్ణం చేసినప్పుడే వారికి మనం నిజమైన వారసులమవుతాము.

-అస్నాల శ్రీనివాస్‌

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ‌
సెల్‌: 9652275560